అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా..? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు ఫేషియల్ హెయిర్ ఇట్టే పోతుంది..
మహిళల్లో ముఖంపై అవాంఛిత రోమాలు హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తాయి. వాక్సింగ్ వంటి తాత్కాలిక పద్ధతులు ఉన్నా, మూల సమస్యకు పరిష్కారం కాదు. పుదీనా, లైకోరైస్, మెంతులు, సోంపు, దాల్చిన చెక్కతో తయారుచేసిన ప్రత్యేక పానీయం హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. దీని ద్వారా అవాంఛిత వెంట్రుకల పెరుగుదలను సహజంగా తగ్గించుకోవచ్చు, మృదువైన చర్మాన్ని పొందవచ్చు.

సాధారణంగా స్త్రీలు తమ అందం గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. కానీ, కొందరు ఆడవాళ్లకు పై పెదవులు, గడ్డం, బుగ్గలపై వెంట్రుకలు పెరగడం సహజం. కొందరికి తక్కువగా ఉంటే, మరికొందరికి ఎక్కువగా ఉంటుంది. ఇది మహిళలకు ఇబ్బందికరంగా మారుతుంది. స్త్రీకి గడ్డం, మీసం ఉండకూడదు. మృదువైన, శుభ్రమైన చర్మం ఉండాలనేది అందరూ కోరుకుంటారు. ఇది అలిఖిత నియమం. అయితే, ముఖంపై అవాంఛిత రోమాలు ఎందుకు పెరుగుతాయి..? వాటిని నివారించే ఉపాయం ఏంటో ఇక్కడ చూద్దాం..
హార్మోన్ల అసమతుల్యత:
ముఖం, గడ్డం మీద అధిక వెంట్రుకలు ఉన్న స్త్రీలు వాక్సింగ్, థ్రెడింగ్, షేవింగ్, లేజర్ ద్వారా వాటిని తొలగిస్తారు. చాలామంది ఇంట్లోనే ఇవన్నీ చేసుకుంటారు. మరికొందరు బ్యూటీ పార్లర్లకు వెళతారు. కానీ, మీరు ఏం చేసినా అది పెరుగుతూనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. మీ ముఖం మీద వెంట్రుకలు పెరగకూడదనుకుంటే మీరు మొదట హార్మోన్ల అసమతుల్యతను సరిచూసుకోవాలి. హార్మోన్లను సమతుల్యం చేసే కొన్ని రకాల ఆహారాలను క్రమం తప్పకుండా తాగితే, మీ హార్మోన్లు సక్రమంగా ఉంటాయి. అవాంఛిత రోమాలు పెరగడం తగ్గుతుంది.
హార్మోన్ల అసమతుల్యతను సరిచేందుకు తీసుకోవాల్సిన ప్రత్యేక పానీయం. దీని తయారీ కోసం ఒక గిన్నెలో నీళ్లు పోసి, పుదీనా, లైకోరైస్(అతి మధురం), మెంతులు, సోంపు, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. హార్మోన్ల అసమతుల్యతతో బాధపడేవారు ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తాగాటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇందులోని లైకోరైస్, మెంతులు హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. మెంతులు ఇన్సులిన్ నిరోధకం కూడా. ఇది PCOS కారణంగా ముఖంపై వెంట్రుకల పెరుగుదలను నిరోధిస్తుంది. సోంపు గింజలు జుట్టు పెరుగుదలను నియంత్రించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. దాల్చిన చెక్క అవాంఛిత వెంట్రుకల పెరుగుదలకు కారణమయ్యే ఒత్తిళ్లను సమతుల్యంగా ఉంచుతుంది.
ఈ పానీయంలోని పదార్థాలు ఆండ్రోజెన్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అవి ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా సమతుల్యం చేస్తాయి. మహిళల్లో ఆండ్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతాయి. అది నియంత్రణలో ఉంటే జుట్టు పెరుగుదల తగ్గుతుంది. మీరు ఏమి చేసినా, అంతర్లీన సమస్యలను మీరు పరిష్కరిస్తే తప్ప జుట్టు పెరుగుదల తగ్గదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




