చిగుళ్లలో బ్లీడింగ్? డయాబెటిస్, గుండె జబ్బులకు సంకేతమా?
సాధారణంగా కొందరికి బ్రష్ చేసుకునేటపుడు లేదా గట్టి ఆహార పదార్థాలు తినేటపుడు మాత్రమే చిగుళ్ల నుంచి రక్తం రావచ్చు. కానీ, ఇది తరచూ జరుగుతున్నట్లయితే, నిపుణులు వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందని సూచిస్తున్నారు. ఎందుకంటే, చిగుళ్లలో రక్తం రావడం కేవలం సాధారణ సమస్య కాదు, ఇది డయాబెటిస్, గుండె జబ్బులు వంటి ప్రమాదకర వ్యాధుల సంకేతం కావచ్చు.

సాధారణంగా కొందరికి బ్రష్ చేసుకునే సమయంలోనే, ఏదైనా గట్టి ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది. అయితే, తరచూ ఇలా జరిగే మాత్రం వైద్యులను సంప్రదించాల్సిందేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది ప్రమాదకర వ్యాధుల సంకేతం కూడా కావచ్చిన అంటున్నారు. చిగుళ్ల నుంచి రక్తం రావడాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోవద్దని చెబుతున్నారు.
చిగుళ్లలో రక్తం ఎందుకు వస్తుంది?
ఎక్కువ సందర్భాల్లో ఇది గమ్ డిసీజ్ (పీరియోడాంటల్ ఇన్ఫెక్షన్) వల్ల వస్తుంది. దంత మాంసంలో వాపు, ఇన్ఫెక్షన్ ఏర్పడితే బ్లీడింగ్ కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ బ్లీడింగ్ ప్రమాకర వ్యాధులకు సంకేతాలు కూడా కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్‌కు సంకేతమా?
రక్తంలో షుగర్ ఎక్కువగా ఉంటే.. ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. చిగుళ్ల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో గమ్ డిసీజ్ ప్రమాదం 3–4 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే చిగుళ్లలో బ్లీడింగ్ కనిపిస్తే షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు.
గుండె జబ్బులకు సంకేతమా?
గమ్ డిసీజ్ ఉన్నవారిలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇది నేరుగా గుండెపోటుకు కారణమనే ఆధారాలు మాత్రం లేవు. కానీ, చిగుళ్ల ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాస్తవం ఏంటి? జాగ్రత్త ఎప్పుడు అవసరం?
చిగుళ్ల బ్లీడింగ్.. తప్పకుండా డయాబెటిస్ లేదా గుండె జబ్బు కాదు. కానీ ఈ సమస్యలను ముందే గుర్తించే వార్నింగ్ సైన్ కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. తరచూ చిగుళ్లలో రక్తం వస్తుంటే.. దంత మాంసం వాపు, నొప్పి, దుర్వాసన ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబంలో డయాబెటిస్, హార్ట్ డిసీజ్ హిస్టరీ ఉన్నా కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాలి.
చిగుళ్ల నుంచి రక్తం కారుతున్న సూచనలు కనిపిస్తే.. రోజుకు రెండుసార్లు సాఫ్ట్ బ్రష్‌తో బ్రష్ చేయాలి. నోటి పరిశుభ్రత తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. అవసరమైతే డెంటిస్ట్, డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.
