AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

De-Stress Food: మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?

నేటి కాలంలో అధిక మంది మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. పని, వ్యక్తిగత చింతలు, కుటుంబ బాధ్యతలు మాత్రమే కాదు జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా మనల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ ఒత్తిడి కారణంగా చాలా మంది సంతోషకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు. అంతేకాకుండా అధిక ఒత్తిడి..

De-Stress Food: మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?
Foods
Srilakshmi C
|

Updated on: Jan 13, 2026 | 8:11 AM

Share

నేటి కాలంలో అధిక మంది మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. పని, వ్యక్తిగత చింతలు, కుటుంబ బాధ్యతలు మాత్రమే కాదు జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా మనల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ ఒత్తిడి కారణంగా చాలా మంది సంతోషకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు. అంతేకాకుండా అధిక ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సందర్భంగా ఒత్తిడిని వదిలించుకోవడానికి, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ముఖ్య ఆహారాలు తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఒత్తిడిని తగ్గించడానికి ఉపయెగపడే ఆహారాలు ఇవే

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. డార్క్ చాక్లెట్ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి దీనిని మితంగా తినాలి.

అరటిపండు

అరటిపండ్లు సులభంగా జీర్ణమయ్యే పండ్లు. వాటిలో విటమిన్ బి6, పొటాషియం, ట్రిప్టోఫాన్ కూడా ఉంటాయి. ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కాబట్టి మీరు ఒత్తిడి నుంచి బయటపడటానికి అరటిపండ్లను కూడా తినవచ్చు.

ఇవి కూడా చదవండి

బాదం, వాల్‌నట్స్

డ్రై ఫ్రూట్స్‌ గింజల్లో మంచి మొత్తంలో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్స్ ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి ప్రతి ఉదయం బాదం, వాల్‌నట్స్ తో మీ రోజును ప్రారంభించండి.

బెర్రీస్

బెర్రీస్ అనేవి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు. ఇవి శరీరాన్ని ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. సంతోషకరమైన హార్మోన్లను కూడా విడుదల చేస్తాయి. కాబట్టి, ఈ పండ్లను క్రమం తప్పకుండా తినండి.

చిలగడదుంపలు

చిలగడదుంపలలో విటమిన్ సి, పొటాషియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఎల్-థియనిన్ అనే ప్రత్యేకమైన సమ్మేళనం ఉంటుంది. ఇది మనసుకు విశ్రాంతినిచ్చి ఒత్తిడి ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో కెఫిన్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.