AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రొయ్యలు తిన్న తర్వాత ఇవి తిన్నారో మీ పని అయిపోయినట్లే.. బాడీ షెడ్డుకెళ్లడం పక్కా..

సీఫుడ్ అనగానే మనకు గుర్తొచ్చేది రొయ్యలు. వీటి రుచికి ఫిదా కాని వారు ఉండరు. అయితే రొయ్యలను ఎలా పడితే అలా, వేటితో పడితే వాటితో కలిపి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలతో కలిపి రొయ్యలను తీసుకోవడం వల్ల అలెర్జీలు రావడం మాత్రమే కాదు, కొన్నిసార్లు అది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. రొయ్యలతో పాటు అస్సలు తీసుకోకూడని ఆ 5 ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం.

Krishna S
|

Updated on: Jan 12, 2026 | 7:29 PM

Share
పాల ఉత్పత్తులు: చాలా మంది రొయ్యలను క్రీమీ సాస్‌లతో లేదా పాలతో కలిపి వండుతుంటారు. కానీ రొయ్యలలోని ప్రొటీన్లు, పాల ఉత్పత్తుల్లోని కాల్షియంతో చర్య జరిపి కడుపులో గడ్డలుగా మారే అవకాశం ఉంది. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా తీవ్రమైన కడుపు నొప్పికి దారితీస్తుంది.

1 / 5
సిట్రస్ పండ్లు: రొయ్యల వంటకాలపై నిమ్మరసం పిండటం కామనే. అయితే అతిగా నిమ్మరసం లేదా ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లను రొయ్యలతో కలిపి తీసుకోవడం వల్ల లోపల అసిడిటీ పెరిగిపోతుంది. ఈ ఆమ్లత్వం రొయ్యల ప్రొటీన్లతో వికటించి ఉదర సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి వీటిని మితంగానే వాడాలి.

2 / 5
రొయ్యలలో సహజంగానే ఐరన్ ఉంటుంది. దీనికి తోడు పాలకూర లేదా ఎర్ర మాంసం వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను కలిపి తింటే శరీరంలో ఐరన్ మోతాదు మించిపోతుంది. అవసరం లేని వారికి ఈ అధిక ఐరన్ లోడ్ అవయవాలపై ప్రభావం చూపుతుంది.

3 / 5
అధిక పిండి పదార్థాలు: రొయ్యలతో పాటు భారీగా అన్నం, పాస్తా లేదా రొట్టెలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. రొయ్యలు త్వరగా అరగవు. దీనికి తోడు కార్బోహైడ్రేట్లు తోడైతే కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది. వీటితో పాటు తేలికపాటి కూరగాయలు తీసుకోవడం ఉత్తమం.

4 / 5
మితిమీరిన మసాలాలు: రొయ్యలు స్వతహాగా సున్నితమైన రుచిని కలిగి ఉంటాయి. అతిగా కారం, మసాలాలు జోడించడం వల్ల రొయ్యల అసలు రుచి పోవడమే కాకుండా కడుపులోని పేగుల పొరలు చికాకుకు గురవుతాయి. ఇది అజీర్ణం, గ్యాస్ సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది.

5 / 5