AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతి నుంచి వారికి ఉద్యోగ అవకాశాలు వెల్లువ..! ఇందులో మీ రాశి ఉందా..?

Job Astrology 2026: ఈ నెల(జనవరి) 13, 18 తేదీల మధ్య సంక్రాంతి సమయంలో నాలుగు గ్రహాలు మకర రాశిలో కలవడం వల్ల ఉద్యోగార్థులు తప్పకుండా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ఇందులో కుజుడు ఈ మకర రాశిలో ఉచ్ఛ కూడా పడుతున్నందువల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేషం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశులకు అనేక ఉద్యోగ, వ్యాపార, ఆదాయ వృద్ధి అవకాశాలు లభిస్తాయి. రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ఈ మకర రాశి నుంచి బయటపడే లోపు, అంటే ఫిబ్రవరి చివరి లోగా ఈ రాశుల వారికి అనేక అవకాశాలు లభిస్తాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 12, 2026 | 7:01 PM

Share
మేషం: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాల యుతి జరుగుతున్నందు వల్ల సంక్రాంతి తర్వాత ఈ రాశివారికి ఉద్యోగపరంగా కీలక శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం కలుగుతుంది. ఉద్యోగంలో కొత్తగా చేరిన వారికి స్థిరత్వం లభిస్తుంది. ఇతరులకు పదోన్నతులకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. విదేశీ అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది.

1 / 6
కర్కాటకం: ఈ రాశికి సప్తమంలో నాలుగు గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల ఈ రాశివారి జీవితంలో తప్ప కుండా పురోగతి ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆశించిన ఉద్యోగం లభించడంతో పాటు, ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత ఈ రాశివారు ఆదాయం లేకుండా ఉండే అవకాశం లేదు. ఉపాధికి, ఆదాయానికి  అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు తప్పకుండా విజయం సాధిస్తారు.

2 / 6
తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల ఈ రాశివారికి ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించడం మంచిది. ఏ ఉద్యోగంలోనైనా దూసుకుపోతారు.

3 / 6
ధనుస్సు: ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజ, బుధ, రవి, శుక్రులు కలవడం వల్ల ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు స్థిరత్వం పొందడం, నిలదొక్కుకోవడం, పురోగతి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సంక్రాంతి తర్వాత వీరి జీవితం చాలావరకు మారిపోయి, అభివృద్ది బాట పడుతుంది. ఇంట్లో కూర్చుని సంపాదించే అవకాశాలు కూడా లభిస్తాయి. అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది.

4 / 6
మకరం: ఈ రాశిలో నాలుగు శుభ గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగావకాశాలు బాగా మెరుగుపడతాయి. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. ఆదాయపరంగా, ఉద్యోగపరంగా జీవితం చాలావరకు మారిపోయే అవకాశం ఉంది.

5 / 6
మీనం: ఈ రాశికి లాభ స్థానంలో ప్రధాన గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల అనేక విధాలుగా పురోగతి చెందే అవకాశం ఉంది. ఈ రాశివారికి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. సంక్రాంతి తర్వాత కోరు కున్న సంస్థలో ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. ఏదో విధంగా చేతిలో డబ్బు ఉండడానికి అవకాశం కలుగుతుంది. వ్యాపారాల్లోనూ, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లోనూ పెట్టుబడులు పెట్టి సంపాదన పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. కొద్దిగా నిరీక్షించడం మంచిది.

6 / 6