AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతికి నాలుగు గ్రహాల సందడి..ఈ రాశుల వారికి కనక వర్షం ఖాయం..!

Sankranti 2026 Astrology: ఈ నెల (జనవరి) 12న శుక్రుడు, 15న రవి, 17న కుజుడు, 18న బుధుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ ఏడాది సంక్రాంతి ప్రాంతంలో గ్రహాల సందడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నాలుగు గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారికి సంక్రాంతితో లక్ష్మీ కటాక్షంతో పాటు ధన ధాన్య సమృద్ధియోగం, ధన యోగాలు ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. సంక్రాంతి పర్వదినం తరువాత దాదాపు నెల రోజుల పాటు ఈ గ్రహాలన్నీ మకర రాశిలోనే కొనసాగే అవకాశం ఉన్నందువల్ల మేషం, వృషభం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది. ధన వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కనక వర్షం కురిసే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 12, 2026 | 6:30 PM

Share
మేషం: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛపట్టడంతో పాటు, శుక్ర, బుధ, రవులు కూడా సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఒక నెల రోజుల పాటు విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభించడంతో పాటు, రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందడం, మొండి బాకీలు కూడా వసూలు కావడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.

1 / 7
వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో పాటు కుజ, రవి, బుధులు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారి మీద అక్షరాలా కనక వర్షం కురిసే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకటికి రెండు సార్లు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడంతో పాటు విదేశీ సంపాదన యోగం కలిగే అవకాశం కూడా ఉంది. గృహ, వాహన యోగాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి.

2 / 7
కన్య: రాశ్యధిపతి బుధుడితో పాటు రవి, శుక్ర, కుజులు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి కలలో కూడా ఊహించని రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.

3 / 7
తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో మూడు గ్రహాలు కలవడం వల్ల జీవితం నెల రోజుల పాటు నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా, స్థితిగతులు పెరగడంతో పాటు సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం, కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది.

4 / 7
ధనుస్సు: ఈ రాశికి ధన స్థానంలో నాలుగు గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. జీతభత్యాలు, రాబడి, లాభాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదే వీలు, వడ్డీ వ్యాపారాలు బాగా లాభిస్తాయి. మీ సలహాలు, సూచనల వల్ల మీరు పనిచేసే సంస్థలు లబ్ధి పొందుతాయి. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

5 / 7
మకరం: ఈ రాశిలో నాలుగు గ్రహాల సంచారం కారణంగా ఈ రాశివారికి అన్ని విధాలా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆశించిన ప్రాంతానికి బదిలీ అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

6 / 7
మీనం: ఈ రాశికి లాభ స్థానంలో నాలుగు శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గిపోతుంది. మీ వల్ల మీరు పనిచేసే సంస్థ బాగా లభ్ధి పొందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఘన విజయం సాధిస్తాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

7 / 7
సంక్రాంతికి నాలుగు గ్రహాల సందడి..ఈ రాశుల వారికి కనక వర్షం ఖాయం..!
సంక్రాంతికి నాలుగు గ్రహాల సందడి..ఈ రాశుల వారికి కనక వర్షం ఖాయం..!
సూర్య దోషం.. సంక్రాంతి నాడు ఇలా చేస్తే దోషం పోయి శుభ ఫలితాలు

లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా?

ఫిబ్రవరి 1న బడ్జెట్‌.. స్టాక్‌ మార్కెట్‌ ఓపెన్‌ ఉంటుందా?

ఇంట్లో చెత్త బుట్ట ఎక్కడ పెడుతున్నారు? ఈ తప్పులు చేశారంటే నాశనమే!

శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం

ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్

పిల్లలకు ఆరు నెలల వరకు తల్లి పాలు ఇస్తే.. ఇక వారికి తిరుగుండదు

తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే ఏపీ వాడుకుంటుంది

జనవరి 31లోపు ఈ పని చేయకపోతే గ్యాస్ డబ్బులు కట్.. బీ అలర్ట్