తెలంగాణ మహా కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరగనుంది. రూ.110 కోట్ల అభివృద్ధి పనులతో మేడారం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో సమ్మక్క-సారలమ్మ తల్లులు గద్దెలపైకి వస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరితే, తమ బరువుకు సరిపడా బెల్లాన్ని (ఎత్తు బంగారం) సమర్పించడం ఆనవాయితీ.