తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..
Chicken Gizzard: చికెన్ అంటే కేవలం లెగ్ పీసులు, వింగ్స్ మాత్రమే కాదు.. గిజార్డ్స్ కూడా చాలా మందికి ఫేవరెట్. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ లభించే ఈ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, అందరి విషయంలో ఇది నిజం కాదు. కొన్ని సమస్యలు ఉన్నవారు ఇవి తినకపోవడమే మంచిది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నాన్ వెజ్ ప్రియుల్లో ఎక్కువ మందికి ఇష్టమైనది చికెన్. చికెన్‌లో లివర్‌తో పాటు కోడి జీర్ణవ్యవస్థలోని కండర భాగమైన గిజార్డ్స్‌ను కూడా చాలామంది ఇష్టంగా తింటారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా తక్కువ ధరకే లభిస్తాయి. అయితే ఇవి అందరికీ ఆరోగ్యకరమేనా? ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు వీటిని తినవచ్చా? నిపుణులు ఏం అంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అసలు గిజార్డ్ అంటే ఏమిటి?
కోళ్లకు దంతాలు ఉండవు కాబట్టి అవి తినే గింజలను నలిపి జీర్ణం చేయడానికి ఉపయోగపడే బలమైన కండరాల అవయవమే ఈ గిజార్డ్. ఇందులో కొవ్వు తక్కువగా ఉండి.. ప్రోటీన్, ఐరన్, జింక్, సెలీనియం, విటమిన్ B12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక్క గిజార్డ్‌లో దాదాపు 7 నుండి 10 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.
యూరిక్ యాసిడ్ బాధితులకు హెచ్చరిక
గిజార్డ్స్ పోషకాల గని అయినప్పటికీ.. అధిక యూరిక్ యాసిడ్ లేదా గౌట్ సమస్యతో బాధపడేవారికి ఇవి ముప్పు కలిగిస్తాయని డాక్టర్ సంతోష్ జాకబ్ హెచ్చరిస్తున్నారు.
ప్యూరిన్ల ప్రభావం: గిజార్డ్స్ వంటి అవయవ మాంసాలలో ప్యూరిన్లు అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
కీళ్ల నొప్పులు: మన శరీరం ఈ ప్యూరిన్లను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. రక్తంలో ఈ యాసిడ్ స్థాయిలు పెరిగితే కీళ్లలో స్పటికాలుగా మారి గౌట్ అనే తీవ్రమైన కీళ్ల నొప్పులకు దారితీస్తుంది.
పరిశోధనల సారాంశం: న్యూట్రియంట్స్ అనే వైద్య జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గౌట్ సమస్య ఉన్నవారు అవయవ మాంసాలను ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
ఎవరు తినవచ్చు? ఎవరు తినకూడదు?
సాధారణ ఆరోగ్య సమస్యలు లేని వారు సమతుల్య ఆహారంలో భాగంగా గిజార్డ్స్‌ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. తక్కువ కొవ్వుతో ప్రోటీన్ పొందడానికి ఇది మంచి మార్గం. ఇప్పటికే కీళ్ల నొప్పులు, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు వీటిని పూర్తిగా మానేయడం లేదా వైద్యుల సలహా మేరకు చాలా పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.
(Note: ఇందులోని సమాచారం వైద్య నిపుణులు నుంచి సేకరించినది. ఇది అందరి బాడీ టైప్స్‌కు సెట్ అవ్వాలని ఉండదు. మీకు ఎలాంటి అనుమానాలున్నా వైద్యులు లేదా డైటీషియన్లు సంప్రదించండి)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
