AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi first Day Collections : బాక్సాఫీస్ ఛాంపియన్.. థియేటర్లలో పెద్ది ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

ప్రస్తుతం పాన్ ఇండియా థియేటర్లలో పెద్ది సినిమా దూసుకుపోతుంది. భారీ అంచనాల మధ్య జూన్ 4న విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ మేకోవర్, యాక్టింగ్ చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మనసులను కట్టిపడేస్తుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ అధికారికంగా రివీల్ చేసింది నిర్మాణ సంస్థ.

Peddi first Day Collections : బాక్సాఫీస్ ఛాంపియన్.. థియేటర్లలో పెద్ది ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
Peddi Movie
Rajitha Chanti
|

Updated on: Jun 05, 2026 | 11:45 AM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఎంతో కాలంగా మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆటలోనూ, పోరాటంలోనూ తిరుగులేని ఛాంపియన్‌గా నిలిచిన ‘పెద్ది’.. బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో అభిమానులను మెప్పించగా, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన ఖాతాలో ఘన విజయం పడటంతో థియేటర్ల వద్ద సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ ‘పెద్ది’ మొదటి రోజు అధికారిక కలెక్షన్ల వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజే ఏకంగా రూ. 135.36 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ అంటూ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తొలిరోజే ఈ స్థాయి వసూళ్లు సాధించడంతో సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

విజయనగరం జిల్లాలోని ‘కొండ కింద ఊరు’ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రభుత్వ రికార్డుల్లో ఎలాంటి గుర్తింపు లేని ఆ ఊరి మనుషులంటే చుట్టుపక్కల వారికి చాలా చిన్నచూపు. ఆ ఊళ్లోనే పుట్టి పెరిగిన పెద్ది (రామ్ చరణ్) రోజువారీ కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు. అయితే క్రికెట్ ఆటలో అతనికి సాటి ఎవరూ లేరు. విజయనగరం, బొబ్బిలి క్రికెట్ జట్లు అతడిని తమ టీమ్‌లోకి తీసుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతుంటాయి. అలాంటి అద్భుతమైన క్రికెటర్, అనుకోకుండా ఆ ఆటను వదిలేసి కుస్తీ (రెజ్లింగ్) క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? అతని జీవిత ప్రయాణంలో అప్పలసూరి (జగపతిబాబు), గౌర్‌నాయుడు (శివరాజ్‌కుమార్) ఎలాంటి పాత్రలు పోషించారు? అచ్చియమ్మ (జాన్వీ కపూర్)తో పెద్ది బంధం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు అత్యంత ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా తెరకెక్కించారు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

పెద్ది బాక్సాఫీస్ కలెక్షన్స్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

Follow Us