ఆ స్టార్ హీరో సినిమాలో పూజాహెగ్డే ఛాన్స్ కొట్టేసిందా.?
04 June 2026
Pic credit - Instagram
Rajeev
ప్రస్తుతం ఇండస్ట్రీలో బ్యాడ్ లక్ బ్యూటీగా మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన ఈ చిన్నది ఇప్పుడు రేస్ లో వెనకబడింది.
వరుస ఫ్లాప్స్ తో బ్యాడ్ లక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. పూజ హెగ్డే నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవుతున్నాయి.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నదానికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.
స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ అమ్మడిని ఆదుకోలేకపోతున్నాయి. దాంతో ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.
ఓ వైపు రష్మిక, కీర్తిసురేష్, త్రిష, నయన్ లాంటి హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే పూజా మాత్రం హిట్స్ లేక సతమతం అవుతుంది.
పూజా హెగ్డే సౌత్ చివరిగా స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమాలో కనిపించింది. కూలీలో స్పెషల్ సాంగ్ చేసింది. విజయ్ జననయగాన్ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా రిలీజ్ కాలేదు.
ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్ వినిపిస్తుంది. వెంకటేష్ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్.