Video: పిల్లలతో నది దాటుతోన్న లేడీ లయన్.. సడన్‌గా దూసుకొచ్చిన మొసలి.. కట్‌చేస్తే..
Lioness Fights Crocodile: అడవిలో జంతువుల పోరాటం ఎప్పుడూ జరిగేది. తమ ఆహారం కోసం పక్క జంతువులపై దాడి చేయడం అక్కడ మాములే. కానీ వీటికి సంబంధించిన వీడియోలకు మాత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్ పాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. తాజాగా అలాంటిదే సింహం, మొసలి మధ్య చోటు చేసుకుంది.

Lioness Fights Crocodile: నది దాటడం సింహాల కుటుంబానికి అంత పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ప్రశాంతంగా కనిపిస్తున్న ఆ నీటి లోపల మృత్యువు దాగి ఉందని ఆ మూగజీవాలు ఊహించలేకపోయాయి. కన్నతల్లి కళ్ళ ముందే సింహం పిల్లను మొసలి లాక్కెళ్లిన హృదయవిదారక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రశాంతమైన నది.. క్షణంలో మారిన ప్రయాణం..
ప్రకృతి ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఊహించడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా అడవిలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. క్రూర జంతువులైన సింహాలకు కూడా ఒక్కోసారి కాలం కలిసిరాదు. ఒక నదిని దాటడానికి సింహాల గుంపు సిద్ధమైంది. అందులో కొన్ని పెద్ద సింహాలు, మరికొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి. తల్లి సింహం వెనుక అమాయకంగా అడుగులు వేస్తూ ఆ బుజ్జి సింహం పిల్లలు నదిలోకి దిగాయి. నీటి లోతు తక్కువగానే ఉండటంతో ఎలాంటి ప్రమాదం లేదని భావించాయి.
సింహం పిల్లలు నది మధ్యలోకి చేరుకోగానే ఒక్కసారిగా కలకలం రేగింది. నీటి అడుగున నక్కి ఉన్న ఒక భారీ ముసలి క్షణాల వ్యవధిలో మెరుపు వేగంతో దాడి చేసింది. గుంపులో ఉన్న ఒక చిన్న సింహం పిల్లను తన బలమైన దవడలతో గట్టిగా పట్టుకుంది. ఊహించని ఈ ప్రమాదంతో సింహాలన్నీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.
బిడ్డను కాపాడుకునేందుకు తల్లి సింహాల పోరాటం..
కళ్ళముందే బిడ్డ మృత్యువు నోట్లోకి వెళ్తుంటే ఏ తల్లి ఊరుకుంటుంది? అది అడవి జంతువైనా సరే, కన్నప్రేమ ముందు ప్రాణాలు ఎంత? ముసలి దాడి చేయగానే అక్కడున్న మూడు పెద్ద సింహాలు ఏమాత్రం జంకకుండా నీటిలోకి దూకాయి. ఆ భారీ మొసలిపై విరుచుకుపడ్డాయి. తమ పదునైన గోళ్లు, పళ్లతో మొసలిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. నీరంతా బురదమయంగా మారి, అక్కడ పెద్ద యుద్ధమే నడిచింది. సింహాల పోరాటంతో మొసలి వెనక్కి తగ్గింది. ఎట్టకేలకు ఆ సింహం పిల్లను వదిలిపెట్టింది.
ప్రకృతి నియమాలు చాలా క్రూరంగా ఉంటాయి. అడవికి రాజైనా సరే, నీటిలో మొసలికి తలవంచక తప్పదని ఈ దృశ్యం మనకు మరోసారి గుర్తుచేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి, నెటిజన్ల మనసులను దోచుకుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




