AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya: తొలి తిరుపతిలో యాంకర్ అనసూయ.. శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న సినీనటి.. ఫోటోస్ వైరల్..

కాకినాడ జిల్లా పెద్దాపురం లో ప్రముఖ టీవీ యాంకర్, వర్తమాన సినీ హీరోయిన్ అనసూయ భరద్వాజ్ సందడి చేశారు. స్తానిక శృంగార వల్లభ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా విజిటింగ్ లో భాగంగా పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వేంచేసియున్న శ్రీ శృంగార వల్లభ స్వామి ని దర్శించుకున్నారు. అనసూయ భరద్వాజ్ కు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం ఫలికారు. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అనసూయకు వేద ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను తెలియజేస్తూ స్వామివారి ఫోటోను ప్రసాదాన్ని అనసూయకు అందజేశారు.

Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 12:36 PM

Share
బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా, వెండితెరపై విలక్షణ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈ నటి, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా, పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం 'శ్రీ శృంగార వల్లభ స్వామి' (తొలి తిరుపతి) ఆలయాన్ని సందర్శించారు. షూటింగ్ బిజీ షెడ్యూల్స్ నుండి కాస్త విరామం దొరకడంతో ఆమె స్వామివారి దర్శనార్థం ఇక్కడికి విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న అనసూయకు అర్చకులు, దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు.

1 / 5
అనంతరం ఆమె గర్భగుడిలో కొలువై ఉన్న శృంగార వల్లభ స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి, స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను బహూకరించారు. చిరునవ్వుతో, చల్లని చూపులతో భక్తులను అనుగ్రహించే స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకోవడం తనకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇచ్చిందని ఆమె ఈ సందర్భంగా వ్యక్తపరిచారు. తిరుమల శ్రీవారి ఆలయం కంటే ముందే వెలిసిన క్షేత్రం కావడంతో దీనిని 'తొలి తిరుపతి' అని పిలుస్తారు.

2 / 5
ఇక్కడి స్వామివారి విగ్రహం దాదాపు నాలుగున్నర అడుగుల ఎత్తుతో, ముఖంపై చిరునవ్వుతో (చిద్విలాస వదనంతో) అత్యంత సుందరంగా ఉంటుంది. అందుకే స్వామివారికి 'శృంగార వల్లభ స్వామి' అనే పేరు వచ్చింది. ధృవుడి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ఇక్కడే లక్ష్మీసమేతుడై స్వయంభూగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. సరికొత్త ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న అనసూయ, తన కెరీర్ మరింత విజయవంతంగా సాగాలని, కుటుంబం క్షేమంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో అనసూయను చూసేందుకు స్థానిక భక్తులు, అభిమానులు ఆసక్తి చూపించారు.

3 / 5
ఆమె వారందరికీ నమస్కరిస్తూ, కొందరితో సెల్ఫీలు కూడా దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయ భరద్వాజ్ తన విలక్షణమైన పాత్రలతో, వైవిధ్యమైన నటనతో టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్ పరంగా సరికొత్త ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు.  అభిషేక్ నామా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అడ్వెంచరస్ మిస్టరీ థ్రిల్లర్ నాగబంధంలో అనుసూయ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఆమె.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు.

4 / 5
శృంగార వల్లభ స్వామి ఆలయం విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా, పెద్దాపురం మండలం 'తిరుపతి' గ్రామం (దివిలి గ్రామానికి సమీపంలో) లో వెలిసిన శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. దీనినే భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో 'తొలి తిరుపతి' అని పిలుస్తారు. సాధారణంగా విష్ణుమూర్తి విగ్రహాలకు కుడిచేతిలో చక్రం, ఎడమచేతిలో శంఖం ఉంటాయి. కానీ తొలి తిరుపతి ఆలయంలో తిరుమల శ్రీవారికి భిన్నంగా శంఖ, చక్రాల స్థానాలు మారి ఉంటాయి.స్థానిక శాసనాలు, నమ్మకాల ప్రకారం ఈ క్షేత్రానికి దాదాపు 9,000 ఏళ్ల చరిత్ర ఉంది.

5 / 5
Follow Us