AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghava Lawrence : ఏంటీ.. లారెన్స్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..

రాఘవ లారెన్స్.. సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం భాషలలో నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడూ సినిమాలు, సామాజిక సేవతో బిజీగా ఉండే లారెన్స్.. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అంతగా బయటపెట్టరు. అలాగే తన కుటుంబం ఫోటోస్ సైతం అంతగా రివీల్ చేయరన్న సంగతి తెలిసిందే.

Raghava Lawrence : ఏంటీ.. లారెన్స్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..
Raghava Lawrence
Rajitha Chanti
|

Updated on: Jun 05, 2026 | 11:14 AM

Share

సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి రాఘవ లారెన్స్. ముఖ్యంగా ‘ముని’, ‘కాంచన’ సిరీస్‌లతో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ప్రస్తుతం ‘కాంచన 4’తో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌కు చెందిన ‘బెంజ్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న లారెన్స్ కుటుంబం నుంచి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. రాఘవ లారెన్స్ వారసురాలు, ఆయన కుమార్తె రాఘవి త్వరలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే సాధారణంగా స్టార్ వారసులు అనగానే నటన వైపు మొగ్గు చూపుతారు. కానీ రాఘవి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ మెగాఫోన్ పట్టి డైరెక్టర్ సీట్లో కూర్చోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

రాఘవి ప్రస్తుతం అమెరికాలో సినిమా మేకింగ్‌కు సంబంధించిన ప్రత్యేక కోర్సు పూర్తి చేస్తున్నారు. ఆమెకు సినిమాలోని వివిధ విభాగాలపై మంచి అవగాహన ఉంది. తండ్రిలాగే లారెన్స్ కూడా రాఘవేంద్రస్వామి భక్తుడు కావడంతో తన కుమార్తెకు ‘రాఘవి’ అని పేరు పెట్టారు. అయితే ఆమె ఇప్పటివరకు మీడియా ముందుకు పెద్దగా రాకపోవడంతో, లారెన్స్‌కు ఇంత పెద్ద కుమార్తె ఉందనే విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియదు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, రాఘవి ఒక వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయిందని, ఫైనల్ డ్రాఫ్ట్ కూడా రెడీగా ఉందని తెలుస్తోంది. అమెరికా నుండి చెన్నై తిరిగి వచ్చిన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆమె స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మరి తండ్రిలాగే ఈమె కూడా హారర్ జానర్‌ను ఎంచుకుంటుందా? లేక సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక మహిళా దర్శకురాలిగా రాఘవి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

రాఘవ లారెన్స్ కూతురు..

View this post on Instagram

A post shared by ELVIIN (@elviinvinu_updates)

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

Follow Us
సినిమాల్లోకి రాఘవ లారెన్స్ కూతురు..
సినిమాల్లోకి రాఘవ లారెన్స్ కూతురు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్! వైద్యుల ఆందోళనకు కారణమేంటి?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్! వైద్యుల ఆందోళనకు కారణమేంటి?
బ్యాచ్‌లర్స్... తగినంత సమయం లేనప్పుడు ఇలా చికెన్ కర్రీ చేసుకోండి
బ్యాచ్‌లర్స్... తగినంత సమయం లేనప్పుడు ఇలా చికెన్ కర్రీ చేసుకోండి
సింగిల్ టేక్‌లో రాంచరణ్ సిగ్నేచర్ స్టెప్పులతో ఇరగదీసిన ఫ్యాన్
సింగిల్ టేక్‌లో రాంచరణ్ సిగ్నేచర్ స్టెప్పులతో ఇరగదీసిన ఫ్యాన్
షుగర్ పేషెంట్స్ ఈ ఫుడ్ తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
షుగర్ పేషెంట్స్ ఈ ఫుడ్ తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
ఏ పని చేపట్టినా పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నాయా?
ఏ పని చేపట్టినా పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నాయా?
పాములు నిద్రిస్తున్నప్పుడు కళ్లు ఎందుకు తెరిచి ఉంచుతాయంటే?
పాములు నిద్రిస్తున్నప్పుడు కళ్లు ఎందుకు తెరిచి ఉంచుతాయంటే?
ఇది పక్షి కాదు.. ప్రకృతి శాస్త్రవేత్త! గుడ్ల ఆధారంగానే వర్షాలు!!
ఇది పక్షి కాదు.. ప్రకృతి శాస్త్రవేత్త! గుడ్ల ఆధారంగానే వర్షాలు!!
ఘాటైన మసాలాలతో నోరూరించే మటన్ తలకాయ కూర.. తయారీ విధానం ఇదే!
ఘాటైన మసాలాలతో నోరూరించే మటన్ తలకాయ కూర.. తయారీ విధానం ఇదే!
తమిళనాడు బీజేపీకి బిగ్ షాక్.. అన్నామలై రాజీనామా..
తమిళనాడు బీజేపీకి బిగ్ షాక్.. అన్నామలై రాజీనామా..