Peddi Movie Review: ‘నిజంగా పెద్ది పెద్దోడైపోయాడు..’ వాటే.. పెర్ఫార్మెన్స్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ భావోద్వేగాలు, క్రీడా నేపథ్యం, గ్రామీణ జీవన వాస్తవాల మేళవింపుగా నిలిచింది. తన ఊరికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో పోరాడే యువకుడి కథను దర్శకుడు హృద్యంగా తెరకెక్కించాడు. రామ్ చరణ్ నటన, ఏఆర్ రెహ్మాన్ సంగీతం, క్లైమాక్స్ భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. పెద్ది కథలోకి వెళితే.. విజయనగరానికి కూత వేటు దూరంలో ఉన్నా కూడా కొండ కింద ఊరు కావడంతో కనీసం మనుషుల్లా కూడా గుర్తించరు పెద్దిని, అతని ఊరిని. ఆ ఊరికి కనీస గుర్తింపు తీసుకురావాలని, ఊళ్లో రైలు ఆగితే తమ బతుకులు బాగుపడతాయని 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉంటాడు అప్పలసూరి అలియాస్ జగపతిబాబు. మరోవైపు కొండ కింది నుంచి విజయనగరానికి వచ్చి పనిచేసుకొని బతుకుతూ ఉంటారు పెద్ది ఊరు జనం. పెద్ది క్రికెట్ బాగా ఆడతాడు అని తెలిసి అతన్ని వేలంపాటలో కొనుక్కుంటూ ఆ ఊరి జనం మ్యాచ్ లాడుతుంటారు. ఇక అదే ఊర్లో ఉండే ఒక పొలిటికల్ లీడర్ కూతురు అచ్చియమ్మా అలియాస్ జాన్వీ కపూర్‌ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు పెద్ది. అదే సమయంలో క్రికెట్ వదిలేసి కుస్తీ వైపు అడుగులు వేస్తాడు.. అక్కడినుంచి రన్నింగ్ వైపు వస్తాడు. అలా క్రాసోవర్ అథ్లెట్‌గా ఎందుకు మారతాడు? కొండ కింది ఊరు నుంచి ఢిల్లీ వరకు పెద్ది ప్రయాణం సాగిస్తాడు. అలా ఎందుకు సాగుతాడు? ఇదంతా ఎందుకోసం..? ఫైనల్‌గా పెద్ది ఊరు బాగుపడిందా? లేదా? అనేది పెద్ది అసలు కథ.. కమర్షియల్ సినిమా చేయడానికి చాలా మంది హీరోలున్నారు.. కానీ కథ నడిపించే సినిమా చేయాలంటే కమర్షియల్ హీరోకు ధైర్యముండాలి. ఆ ధైర్యం చేసాడు రామ్ చరణ్..! పెద్ది సినిమా కాదు ఓ ఎక్స్‌పీరియన్స్!!. బుచ్చిబాబు సినిమా తీయలేదు.. ఓ అద్భుతమైన ఎమోషనల్ కథ చెప్పాడు. సినిమాలో హై మూవెంట్స్ కోసం వెతకొచ్చు కానీ కథలో మాత్రం ఎత్తులు పల్లాలను రెండింటిని చూపించాలి. బుచ్చి అదే చేశాడు. పెద్దిని కథను మాస్ అండ్ ఎమోషన్ కలబోతతో చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ పెద్ది సినిమాలో ఎత్తులే ఉన్నాయని చెప్పలేము.. పల్లాలు కూడా ఉన్నాయి. కానీ ఆ లోతుల్ని మరిపించేలా పెద్దిని చివర్లో పై ఎత్తులో కూర్చోబెట్టాడు బుచ్చిబాబు. తీసుకున్న కథ పాతదే.. గుర్తింపు కోసం ఓ కుర్రాడు చేసే పోరాటమే ఈ సినిమా. తన పోరాటానికి ఆటను ఆయుధంగా, అస్త్రంగా వాడుకుంటాడు. పెద్ది గాడు తన ఆటతో ఏం చేసాడు.. ఊరి భవిష్యత్తు ఎలా మార్చేసాడు అనేది ఈ చిత్ర కథ. ఈ కథ చెప్పడానికి చాలా సింపుల్ కానీ.. బుచ్చిబాబు దీన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఫస్టాఫ్ అంతా కమర్షియల్ పంథాలో నడిపించాడు.. క్రికెట్ సీన్స్ అన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా కూడా.. ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఒక్కసారి కుస్తీ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది.. క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. సినిమా అంతా రామ్ చరణ్ ఒక్కడే తన భుజాలపై నడిపించాడు. తను చెప్పాలనుకున్న కథను.. ఎక్కడా డీవియేట్ కాకుండా చాలా గొప్పగా, హానెస్ట్‌గా చెప్పాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ కూడా తన దర్శకుడు చెప్పిందల్లా కళ్లు మూసుకుని చేసుకుంటూ పోయాడు. కథ క్లైమాక్స్‌కు వచ్చేసరికి తెలియకుండానే బరువైన ఎమోషన్స్ మనసులో మొదలవుతాయి. ముఖ్యంగా ఒక్కడే మూడు ఆటలు ఎందుకు ఆడాల్సి వచ్చింది.. క్రాస్ ఓవర్ అథ్లెట్ ఎందుకయ్యాడు అనేది చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు. క్లైమాక్స్ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టే.. క్లైమాక్స్ సీన్ కూడా ఉంది. అయితే ఆ సీన్ అందరికీ తెలిసినా కూడా తెరపై మాత్రం కళ్లప్పగించే చూస్తారు అందరూ…! ఇక బాలీవుడ్ నటుడు దివ్యేందు క్యారెక్టర్ గురించి కాస్త ఎక్కువగానే మాట్లాడాలి కానీ సినిమాలో మాత్రం అతని పాత్ర చాలా తక్కువగానే అని చెప్పాలి. అత్యంత కీలకమైన పాత్ర పోషించింది జగపతిబాబు అప్పలసూరి.. అలాగే శివరాజ్ కుమార్ పోషించిన గౌర్నాయుడు పాత్ర కూడా పెద్ది జర్నీలో చాలా కీలకం. రామ్ చరణ్ కి ఈ రెండు పాత్రలతో ఉన్న సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఓవరాల్ గా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్లో నుంచి ప్రేక్షకులను బయటికి పంపించాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడని చెప్పడం కూడా చిన్నమాటే అవుతుంది. ఒక్కటైతే నిజం.. రంగస్థలం సిట్టిబాబునే మరిపించే పాత్ర అయితే ఇందులో చరణ్ చేసాడు. శివరాజ్ కుమార్ పాత్ర కూడా చాలా బాగుంది.. జాన్వీ కపూర్, దివ్యేందు క్యారెక్టర్స్ ఓకే. అప్పల సూరిగా జగపతిబాబు చాలా మంచి పాత్ర చేసాడు. మిగిలిన క్యారెక్టర్స్ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో తెరపై కనిపించే హీరో రామ్ చరణ్ అయితే.. తెరవెనక నడిపించిన హీరో AR రెహ్మాన్. ఆయన రీ రికార్డింగ్ చాలా రీ ఫ్రెషింగ్‌గా అనిపించింది.. సినిమా స్థాయిని పెంచేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు ప్రాణం. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది. బుచ్చిబాబు తన వంతు ప్రయత్నం చాలా సిన్సియర్‌గా చేసాడు.. హీరో దొరికాడు కదా అని కమర్షియల్‌గా కాకుండా మంచి కథ చెప్పాడు. వృద్ధి సినిమాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా పెద్ది.. మనసును కదిలించే కొండ కింద ఊరోడి కథ..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టాన్‌ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎల్‌నినో ముప్పు.. ఈ ఏడాదికి ఈ పంటలే బెస్ట్.. రేటుకు రేటు, ప్రభుత్వం హామీ
Silver Price: వెండి దిగుమతిపై కేంద్రం ఆంక్షలు.. మళ్లీ ధర కొండెక్కుతుందా?
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్.. స్కూటీలోనే అన్నీ
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్‌ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..

