AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ క్లూస్‌ని అర్థం చేసుకుని సూపర్ హిట్ తెలుగు పాట ఏదో చెప్పండి చూద్దాం ..

ఊయల, కిందకు పడిపోతున్న గ్రాఫ్, మళ్లీ ఊయల, చివరగా 'లా' గుర్తు... ఈ నాలుగు హింట్లను కలిపి ఓ ప్రముఖ తెలుగు సినిమా పాటను గుర్తించాలి. ప్రస్తుతం ఈ పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లకు సవాల్ విసురుతోంది. దీనికి వెంటనే ఆన్సర్ కనుగుంటే మీరు తోపు అన్నట్లే ..

ఈ క్లూస్‌ని అర్థం చేసుకుని సూపర్ హిట్ తెలుగు పాట ఏదో చెప్పండి చూద్దాం ..
Telugu Song Riddle
Ram Naramaneni
|

Updated on: Jun 05, 2026 | 12:53 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో పజిల్స్, బ్రెయిన్ టీజర్లు వైరల్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా ‘గెస్ ద సాంగ్’ ఛాలెంజ్‌లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఓ ఆసక్తికరమైన పజిల్ సంగీత ప్రియులను ఆలోచనలో పడేసింది. ఈ చిత్రంలో నాలుగు హింట్లు కనిపిస్తున్నాయి. మొదటి, మూడో చిత్రాల్లో చెట్టుకు కట్టిన ఊయలపై ఊగుతున్న అమ్మాయి కనిపిస్తోంది. మధ్యలో గ్రాఫ్ కిందకు పడిపోతున్నట్లుగా ఉంది. చివరగా చట్టాన్ని సూచించే ‘లా’ గుర్తు ఉంది. ఈ హింట్లన్నింటినీ కలిపి చూస్తే ఓ ప్రముఖ తెలుగు సినిమా పాట వస్తుంది. దాన్ని మీరు గుర్తుపట్టాలి.

ఇలాంటి పజిల్స్‌లో చిత్రాలను నేరుగా అర్థం చేసుకోవడం కాకుండా, వాటి తెలుగు పదాలు లేదా ఉచ్చారణలను కలిపి పాట పేరును గుర్తించాల్సి ఉంటుంది. అందుకే ఈ తరహా ఛాలెంజ్‌లు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఒక చిన్న క్లూ ఆధారంగా పాట పేరును గుర్తించడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన పాటే అయినా, హింట్లను కలపలేక చాలామంది సమాధానం చెప్పడంలో విఫలమవుతుంటారు. అయితే ఒక్కసారి సమాధానం తెలిసిన తర్వాత మాత్రం అరే… ఇంత ఈజీనా అనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు సినిమా పాటలపై మంచి పట్టు ఉన్నవారు దీనిని సవాల్‌గా తీసుకుని సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి మీరు ఈ హింట్లను బట్టి ఆ పాట పేరును గుర్తించగలరా?. ఇప్పటికే గుర్తు పట్టి ఉంటే మీరు తోపులు అంతే. తెలియనవాళ్లకు ఆ పాట ఏంటో మేమే చెప్పబోతున్నాం.

ఈ క్లూ నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రంలోని ఉయ్యాలో ఉయ్యాలా సాంగ్. మరి దీన్ని ఎంతమంది సరిగ్గా గుర్తుపట్టారో కామెంట్ చేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us