Pawan Kalyan: ‘నా వ్యక్తిగత హక్కులు కాపాడండి.!’ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం పవన్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతోపాటు.. అనేక e-కామర్స్ సైట్‌లలో తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన వ్యక్తిగత అంశాలను ఉపయోగిస్తున్నాయని ఢిల్లీ హైకోర్టులో వ్యక్తిత్వ హక్కుల పిటిషన్ దాఖలు చేశారు పవన్ కల్యాణ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఏఐ వీడియోల నుంచి ప్రొటెక్షన్ కల్పించాలని కోర్టును కోరారు. తన అనుమతి లేకుండా ఫొటోలు, పేర్లు వాడడంపైనా అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా ఏఐ వీడియోలతో ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారన్నారు. గూగుల్, మెటా, ఎక్స్, ఈకామర్స్ సైట్లలో తన ఏఐ వీడియోలతో.. తప్పుడు ప్రచారం, మార్కెటింగ్ లాంటివి చేస్తున్నారని పవన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. పవన్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని.. సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. గతంలో అజయ్ దేవగన్ కేసులో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇంకా ఆన్‌లైన్‌లోనే ప్రకటనలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు పవన్ న్యాయవాది. పవన్ కళ్యాణ్ హక్కుల ఉల్లంఘన URL లను మధ్యవర్తులకు సమర్పించాలని వారు వారంలోపు వాటిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు న్యాయమూర్తి. తదుపరి విచారణ డిసెంబర్ 22 వాయిదా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




