సింగిల్‌గా టూరు వెళ్లాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!
samatha
Pic credit - Instagram
టూర్ వెళ్లడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే కొంత మంది స్నేహితులు లేదా ఫ్యామిలీస్‌తో వెళితే మరికొంత మంది మాత్రం సింగిల్‌గా టూర్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే ఇప్పుడు మనం సింగిల్‌గా టూర్ వెళ్లాలి అనుకుంటే తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు ఏవీ, ఏ ప్రదేశాలు ఒత్తిడిని తగ్గించి, ఆనందాన్ని ఇస్తాయో చూడాలి.
మనాలి : సింగిల్‌గా టూర్ వెళ్లి ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి మానాలి బెస్ట్ ప్లేస్. ఇక్కడ పచ్చటి ప్రకృతి ప్రశాంతమైన వాతావరణం ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
గోవా వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ బీచ్ ఒడ్డున ఒంటరిగా కూర్చొని, ఆ కెరటాలను చూస్తూ ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును.
సిక్కింలో కూడా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. సోలో ట్రిప్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. గలగలపారే జలపాతాలు, పచ్చటి వాతావరణం అద్భుతంగా ఉంటుంది.
లడఖ్ టూర్ చాలా స్పెషల్ ఉంటుంది. సోలో ట్రిప్ వెళ్లేవారు ఇక్కడికి వెళ్లి ఎత్తైన పర్వతాలు, నీల రంగు జలపాతాలను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
సోలో ప్రయాణం చేయాలి అనుకునే వారికి కేరళ అద్భుతమైన ప్రదేశం ఇక్కడ మున్నార్ హిల్ స్టేష్స్,బ్యాక్ వాట్స్, ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి హిల్స్ కూడా సోలో ట్రిప్ చేయాలి అనుకునే వారికి బెస్ట్ ప్లేస్, ప్రశాంతమైన హిల్ స్టేషన్స్, దట్టమైన అడవుల మధ్య ఎంజాయ్ చేయవచ్చు.