పాము కాటు వేసిన వెంటనే ఇలా చేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే!
samatha
Pic credit - Instagram
పాములంటే చాలా మందికి భయం ఉంటుంది. చాలా మంది పాములను సరిగ్గా చూడటానికి కూడా భయపడి పోతుంటారు.
ఇక కొంత మంది వాటిని దూరం నుంచి మాత్రమే కాదు పాము ఫొటోలు చూడటానికి కూడా వణికి పోతుంటారు. అంతలా భయం ఉంటుంది పాములంటే.
ఎందుకంటే పాము కాటు చాలా భయంకరమైనది. పాము కాటు వేసినప్పుడు సరైన సమయంలో చికిత్స అందితే, ప్రాణాలతో బయటపడవచ్చు, లేకపోతే కొన్ని సార్లు మరణం సంభవిస్తుంటుంది.
అయితే పాము కాటు వేస్తే చాలా మంది ఎక్కువ ఆందోళనకు గురి అయ్యి, కాటు వేసిన ప్రాంతంలో కత్తితో కోసి రక్తం బయటకు తియ్యడం చేస్తారు.
కొంత మంది కాటు వేసిన ప్రదేశానికి కొంచెం పైన గుడ్డతో కాలు లేదా చేయిని చాలా గట్టిగా కట్టుతారు కానీ అలా చేయకూడదంట.
అంతే కాకుండా కొంత మంది నోటితో విషాన్ని బయటకు పీల్చడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ ఇలా చేయకూడదంట. దీని వలన అనేక సమస్యలు వస్తాయంట.
ముఖ్యంగా పాము కాటు వేసిన ప్రదేశంలో కత్తితో కోసి రక్తం బయటకు తియ్యడం వలన అనేక సమస్యలు దరి చేరే ఛాన్స్ ఉంటుందంట, ముఖ్యంగా కొన్ని సార్లు ఇదే ప్రాణానికి ముప్పు తీసుకొస్తుందంట.
అందుకే వీలైనంత వరకు పాము కాటు వేసిన సమయంలో ప్రశాంతంగా ఉండి, వెంటనే దగ్గరి లోని వైద్యుడిని సంప్రదించి, ఏ పాము కరిచిందో చెప్పి, చికిత్స తీసుకోవడం మచిదంట.