Aha-Swathimuthyam: ఆహాలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. స్వాతిముత్యం స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

స్వాతిముత్యం తర్వాత తన సెకండ్ సినిమాకు రెడీ అయ్యాడు బెల్లంకొండ గణేష్. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ''నేను స్టూడెంట్ సార్!' అనే సినిమా చేస్తున్నారు.

Aha-Swathimuthyam: ఆహాలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. స్వాతిముత్యం స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Swathimuthyam
Follow us
Rajitha Chanti

| Edited By: Basha Shek

Updated on: Oct 19, 2022 | 7:11 PM

బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమైన తొలి సినిమా స్వాతిముత్యం. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రసంశలు అందుకుని.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించగా. డైరెక్టర్ లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీమింగ్ కు సిద్ధమైంది. ఎప్పటికప్పుడు సూపర్ హిట్ చిత్రాలతోపాటు.. గేమ్ షోస్.. టాక్ షోలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. ఇప్పుడు స్వాతిముత్యం సినిమాను తీసుకురాబోతుంది.

బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించిన ఈ సినిమా అక్టోబర్ 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్వాతిముత్యం లాంటి ఓ యువకుడి కథే ఈ సినిమా. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు.. అభిప్రాయాల నడుమ జీవిత ప్రయాణం ఎలా సాగుతుందన్నది ఈ సినిమా. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ లక్ష్మణ్.

ఇవి కూడా చదవండి

ఇక స్వాతిముత్యం తర్వాత తన సెకండ్ సినిమాకు రెడీ అయ్యాడు బెల్లంకొండ గణేష్. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ”నేను స్టూడెంట్ సార్!’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.