Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడు, ఎందులో చూడొచ్చునంటే?

'బ్రహ్మాస్త్ర' పార్ట్ 1 శివగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని..

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడు, ఎందులో చూడొచ్చునంటే?
Brahmastra Movie Ott
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 19, 2022 | 11:30 AM

రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకుడు. అస్త్రావెర్స్ నేపధ్యంలో ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో కనిపించారు. ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివగా సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

మరి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబర్ 4వ తేదీ నుంచి ‘బ్రహ్మాస్త్ర’ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.

కాగా, బ్రహ్మస్త్ర పార్ట్ 2ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఆల్రెడీ కథా కథనాలు సిద్ధంగానే ఉన్నాయి కాబట్టి.. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే సీక్వెల్‌లో లీడ్ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు బీ-టౌన్‌లో హాట్ టాపిక్. ఈ రోల్‌లో ఓ టాప్ స్టార్‌ను ఎంపిక చేయాలని చూస్తున్నారట. రణవీర్‌ సింగ్‌, హృతిక్ రోషన్ లాంటి హీరోల పేర్లు వినిపిస్తున్నా… ఇంకా ఎవరినీ ఫైనల్‌ చేయలేదు. సీక్వెల్‌ను దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. బ్రహ్మాస్త్ర పార్ట్ 2ను 2025 డిసెంబర్ కల్లా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..