Ram Charan: ఇది మెగా పవర్ స్టార్ రేంజ్.. రజినీకాంత్, ప్రభాస్ తర్వాత రామ్ చరణే..
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాకు సిసలైన అర్ధం చెప్పిన జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి మన సినిమా సత్తా ఏంటో నిరూపించాడు.
ఇండియాను మాత్రమే కాదు ఏకంగా ప్ప్రపంచాన్ని ఊపేసింది మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి తన దర్శక ప్రతిభతో తెలుగు సినిమా స్థాయిని ఆర్ఆర్ఆర్ రూపంలో మరో మెట్టు పైకి ఎక్కించాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాకు సిసలైన అర్ధం చెప్పిన జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి మన సినిమా సత్తా ఏంటో నిరూపించాడు. హాలీవుడ్ సైతం అదిరిపడేలా చేశారు. ఇప్పటికీ ఎవరినోట విన్న ఆర్ఆర్ఆర్ మాటే.. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులు స్నేహితులైతే ఎలా ఉంటుందో చూపించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, తారక్ నటించారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్. కొమురం భీం గా తారక్ అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాలో ప్రతి సీన్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ కన్ఫామ్ అంటూ ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ కూడా రాసుకొచ్చింది.
ఇక ఈసినిమాకు అన్ని దేశాల్లో ఫ్యాన్స్ పెరిగిపోయారు. ముఖ్యంగా జపాన్ లో.. జపాన్ ప్రేక్షకులకు మన తెలుగు సినిమాలంటే మక్కువ ఎక్కువే. బాహుబలి సినిమా సమయంలో అది రుజువైంది. అక్కడి ప్రేక్షకులను బాహుబలి సినిమా బాగా ఆకర్షించింది. దాంతో హీరో ప్రభాస్ కు, రానా కు అక్కడ ఫ్యాన్స్ పెరిగారు. ప్రభాస్ కోసం అక్కడ నుంచి హైదరాబాద్ కు కూడా వచ్చారు అప్పట్లో.. అంతే కాదు అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు,. సూపర్ స్టార్ స్టైల్ కు జపాన్ ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి మన తెలుగు హీరోకు అక్కడి వారు ఫ్యాన్స్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ కు అక్కడి వారు ఫిదా అయ్యారు.
జపాన్ లో చరణ్ ఫ్యాన్ బేస్ పెరిగింది. తాజాగా జపాన్ లో ఫాన్స్ ను కలిశారు రాంచరణ్. భార్య ఉపాసనతో జపాన్ వెళ్లిన చరణ్ అక్కడి ఫ్యాన్స్ ను కలిశారు. వారితో కలిసి డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజినీకాంత్, ప్రభాస్ తర్వాత చరణ్ కు ఆ రెంజ్ ఫాలోయింగ్ రావడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.