Sardar Movie: సర్ధార్ గా రానున్న కార్తీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఆ స్టార్ హీరో
ముఖ్యంగా కార్తీ నటించిన ఆవారా, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే కార్తీ తెలుగులోనూ స్ట్రయిట్ సినిమా చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి సినిమాతో తెలుగులో స్ట్రయిట్ సినిమా చేశారు కార్తీ.

తమిళ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కార్తీ నటించిన సినిమా లనీ తెలుగులోనూ డబ్ అవుతూ మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా కార్తీ నటించిన ఆవారా, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే కార్తీ తెలుగులోనూ స్ట్రయిట్ సినిమా చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి సినిమాతో తెలుగులో స్ట్రయిట్ సినిమా చేశారు కార్తీ. ఈ సినిమాలో కింగ్ నాగార్జున తో కలిసి నటించారు కార్తీ. ఈ సినిమా లో నాగ్ నటనతో పాటు కార్తీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక కార్తీ అన్న సూర్య మాదిరిగానే హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో కార్తీ నటించాడు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పొన్నియన్ సెల్వన్ సినిమాకు తెలుగు, తమిళ్ భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా సర్దార్.. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌లు, ఫస్ట్‌లుక్‌లో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. అక్టోబర్ 21న తెలుగుతోపాటు, తమిళంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించింది.
రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో ఆరు డిఫరెంట్ గెటప్స్ లో కార్తీ కనిపించనున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా స్పై థ్రిల్లర్ టీగా రానుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ రోజు (బుధవారం) గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరు కానున్నారు.ఇక ఈ సినిమా సూపర్ హిట్ సాదిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో కార్తీకి జోడిగా రాశీఖన్నా, రజిష విజయన్, లైలా నటిస్తున్నారు.







