AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై మనసు పారేసుకున్నానంటున్న స్టార్ హీరోయిన్! ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకోవడం అంటే ఏ నటికైనా అదృష్టమే. అలా ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలో మహేష్ బాబు సరసన తన మొదటి అడుగు వేసి, ఆ తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ నేషనల్ అవార్డ్ ..

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై మనసు పారేసుకున్నానంటున్న స్టార్ హీరోయిన్! ఆ బ్యూటీ ఎవరో తెలుసా?
Icon Star And Star Heroine
Nikhil
|

Updated on: Dec 19, 2025 | 12:43 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకోవడం అంటే ఏ నటికైనా అదృష్టమే. అలా ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలో మహేష్ బాబు సరసన తన మొదటి అడుగు వేసి, ఆ తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ నేషనల్ అవార్డ్ గెలుచుకునే స్థాయికి ఎదిగింది ఒక ముద్దుగుమ్మ. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు టాలీవుడ్‌లో మరో స్టార్ హీరోతో నటించాలని ఉందని, ముఖ్యంగా అతని స్టైల్, యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె మనసులో మాట బయటపెట్టింది. ఇంతకీ మహేష్‌తో నటించిన ఆ భామ ఎవరు? ఆమె ఎవరి కోసం వెయిట్ చేస్తోంది?

మహేష్ బాబు కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన ‘1 నేనొక్కడినే’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయిన ఈ ఢిల్లీ భామ, అక్కడ వరుస హిట్లు అందుకుని టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే, ఇన్నేళ్ల తర్వాత కృతి సనన్ మళ్ళీ సౌత్ సినిమాలపై, ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాతో గ్లోబల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై మనసు పారేసుకుంది.

Allu Arjun And Kriti Sanon

Allu Arjun And Kriti Sanon

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కృతి సనన్ మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. “అల్లు అర్జున్ గారి స్టైల్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు అద్భుతమైన డ్యాన్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయనతో కలిసి ఒక కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్‌లో నటించాలని నాకు చాలా కోరికగా ఉంది. సరైన కథ కుదిరితే తప్పకుండా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటాను” అని తన మనసులోని కోరికను బయటపెట్టింది. గతంలో కూడా అల్లు అర్జున్ సినిమా చూసినప్పుడు కృతి ఆయన పర్ఫార్మెన్స్‌ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టింది.

ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తున్న తరుణంలో, నార్త్ ఆడియెన్స్‌కు కూడా సుపరిచితమైన కృతి సనన్‌ను అల్లు అర్జున్ సరసన ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు. అల్లు అర్జున్ డాన్స్ వేగం, కృతి సనన్ గ్లామర్ తోడైతే వెండితెరపై అది ఒక విజువల్ ఫీస్ట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ బాబుతో అరంగేట్రం చేసిన కృతి సనన్, ఒకవేళ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తే అది టాలీవుడ్‌లో అతిపెద్ద క్రేజీ కాంబో అవుతుందనడంలో సందేహం లేదు.