Allu Aravind : అల్లు అర్జున్.. రామ్ చరణ్‏తో మల్టీస్టారర్.. అప్పుడే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన అల్లు అరవింద్..

మగధీర సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యింది.. దీంతో టెన్షన్ మొదలైంది.. కానీ ఒకరోజు గ్రాఫిక్స్ వర్క్ పూర్తైన తర్వాత ఫుటేజీ చూశా.. వెంటనే నా డిస్ట్రిబ్యూటర్స్ కు ఫోన్ చేసి సినిమా మొత్తం మనమే విడుదల చేస్తున్నాం అని చెప్పాను..

Allu Aravind : అల్లు అర్జున్.. రామ్ చరణ్‏తో మల్టీస్టారర్.. అప్పుడే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన అల్లు అరవింద్..
Ram Charan, Allu Arjun, All
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2022 | 3:20 PM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న బడా ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అలాగు యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూ.. చిన్న సినిమాలను నిర్మించేందుకు ముందుంటున్నారు. ఇటీవల అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల సందర్బంగా కమెడియన్ అలీ నిర్వహిస్తోన్న అలీతో సరదాగా షోకు అతిథిగా విచ్చేసిన ఆయన మొదటి భాగంలో అనేక విషయాలను పంచుకున్నారు. ఇక ఇప్పుడు రెండో భాగంలోనూ మరికొన్ని విషయాలు చెప్పారు. పుష్ప సినిమా బన్నీకి తనకు.. ఇద్దరికీ మైల్ స్టోన్ లాంటిందని.. ఈ మూవీతో బన్నీ నేషనల్ స్టార్ కావడం చాలా తృప్తిగా ఉందని తెలిపారు.అలాగే తమ బ్యానర్‏లో ఎక్కువ సినిమాలు చేసింది కచ్చితంగా చిరంజీవి గారే అని. తీసిన అన్ని సినిమాలు దాదాపు హిట్లే అని అన్నారు. తన జీవితంలో ఒక బ్రహ్మాండమైన సినిమా తీశాను అన్న తృప్తి మగధీర సినిమా ఇచ్చిందని తెలిపారు. అలాగే అల్లు అర్జున్.. చరణ్ కాంబోలో ఓ మల్టీస్టారర్ చేయాలని ఉందని.. ఇందుకోసం దాదాపు 10 ఏళ్ల క్రితమే చరణ్-అర్జున్ అనే కూడా ఫిక్స్ చేసుకున్న.. ఎప్పటికైనా జరుగుతుందని ఆశ ఉందంటూ చెప్పుకొచ్చారు.

అయితే వీరి కాంబోలో కోసం కథలు వింటున్నారా ? అని అడగ్గా.. ఇంకా ప్రారంభించలేదని తెలిపారు. ప్రస్తుతం చరణ్, బన్నీ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్‏గా దూసుకుపోతున్నారు. ఓవైపు అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 చేస్తుండగా.. చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ అంటే ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. బన్నీ.. చరణ్ మల్టీస్టారర్‏పై అంచనాలు సైతం భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కాంబోలో డైరెక్టర్ ఎవరనేది కూడా చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

“మగధీర సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యింది.. దీంతో టెన్షన్ మొదలైంది.. కానీ ఒకరోజు గ్రాఫిక్స్ వర్క్ పూర్తైన తర్వాత ఫుటేజీ చూశా.. వెంటనే నా డిస్ట్రిబ్యూటర్స్ కు ఫోన్ చేసి సినిమా మొత్తం మనమే విడుదల చేస్తున్నాం అని చెప్పాను..అందరూ ఆశ్చర్యపోయారు. మేము అనుకున్న బడ్జెట్ కు దాదాపు 80 శాతం ఖర్చు అధికమైంది. ఆ సినిమాకు నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పెట్టాను. విడుదలయ్యాక దానికి మూడింతలు వచ్చింది. ఒక్కోసారి రిస్క్ చేసి పొగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. చూడాలని ఉంది సినిమా హిందీలో తీశాను. చాలా నష్టం వచ్చింది. ఆరోజుల్లోనే అది భరించలేనంత అమౌంట్” అంటూ చెప్పుకొచ్చారు.