Aamani: ప్రమాదం జరిగినప్పుడు సౌందర్య ప్రెగ్నెంటా ?.. ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ హీరోయిన్ ఆమని..

సౌందర్య మరణవార్త విని తన గుండె ముక్కలయ్యిందని.. ఆమెకు బదులుగా తను చనిపోయిన బాగుండేది అనుకున్నాని చెప్పుకొచ్చారు సీనియర్ హీరోయిన్ ఆమని. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.

Aamani: ప్రమాదం జరిగినప్పుడు సౌందర్య ప్రెగ్నెంటా ?.. ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ హీరోయిన్ ఆమని..
Aamani, Soundarya
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2022 | 3:53 PM

తెలుగు చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయిన హీరోయిన్లలో ఆమని ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమని.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తల్లి, అత్త పాత్రలలో నటిస్తూ అలరిస్తుంది. అయితే దివంగత హీరోయిన్ సౌందర్య.. ఆమని ప్రాణస్నేహితులు అన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టింది. సౌందర్య మరణవార్త విని గుండె ముక్కలయ్యిందని.. ఆమెకు బదులుగా తను చనిపోయిన బాగుండేది అనుకున్నాని తెలిపింది.

ఆమని మాట్లాడుతూ.. ” సౌందర్య చనిపోయింది అని విన్నప్పుడు నా గుండె ముక్కలైపోయింది. దేవుడిని చాలా తిట్టుకున్నాను. ఆమె స్థానంలో నేను చనిపోయినా బాగుండేది అనుకున్నాను. ఎందుకంటే అప్పటికీ నాకు పిల్లలు లేరు. జీవితం చూసేశాను. సౌందర్యకు అప్పుడే పెళ్లయి ఏడాదే అయ్యింది. అప్పుడప్పుడే జీవితం ప్రారంభించింది. అందుకే ఆమె స్థానంలో నేను పోయినా బాగుండు అనుకున్నాను. ఈ ప్రమాదం సమాయానికి సౌందర్య ప్రెగ్నెంట్ అని రాశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని సౌందర్య వాళ్ల అమ్మ చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఒకసారి సౌందర్య వాళ్ల అన్నయ్య అమర్‏ను పెళ్లి చేసుకోవాలనే ప్రపోజల్ వచ్చింది. కానీ అప్పటికే నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. ఒకవేళ తనను పెళ్లిచేసుకుంటే ఎలాగు సౌందర్య కూడా వెళ్తుందిగా.. నేను వస్తాను అని ఫ్లైట్ ఎక్కేదాన్ని లేదా అతని జ్ఞాపకాలతో మిగిలిపోయేదాన్ని.. అంతా విధి.. ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది ” అంటూ చెప్పుకొచ్చారు ఆమని.