Allu Aravind: గీతాఆర్ట్స్‏లో ‘గీతా’ అంటే ఎవరో తెలుసా ?.. అసలు విషయం చెప్పేసిన అల్లు అరవింద్..

అల్లు ఫ్యామిలీలో గీతా అనే పేరు గల వ్యక్తి ఎవరు లేరు. కానీ నిర్మాణ సంస్థకు మాత్రం గీతా అనే పేరు ఉండడంతో అసలు ఎవరు ఈ గీతా ? అనే సందేహాలు చాలా కాలంగా జనాల్లో ఉండిపోయాయి.

Allu Aravind: గీతాఆర్ట్స్‏లో 'గీతా' అంటే ఎవరో తెలుసా ?.. అసలు విషయం చెప్పేసిన అల్లు అరవింద్..
Allu Aravind
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2022 | 7:27 PM

తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిటి చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థలలో గీతాఆర్ట్స్ ఒకటి. కథానాలు. అల్లు అరవింద్ అధినేతగా ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు కొత్తదనంతో.. బలమైన కంటెంట్‏తో ఉంటాయనే నమ్మకం ప్రేక్షకులలో ఉంది. ఇప్పటివరకు భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే కాకుండా బలమైన కథాకథనాలు ఉంటే చిన్న సినిమాలను కూడా ప్రోత్సహిస్తుంది గీతాఆర్ట్స్. అయితే అల్లు ఫ్యామిలీలో గీతా అనే పేరు గల వ్యక్తి ఎవరు లేరు. కానీ నిర్మాణ సంస్థకు మాత్రం గీతా అనే పేరు ఉండడంతో అసలు ఎవరు ఈ గీతా ? అనే సందేహాలు చాలా కాలంగా జనాల్లో ఉండిపోయాయి. ఈ విషయం తెలుసుకోవాలనే కుతూహలం కూడా చాలా మందిలో ఉంది. అయితే ఎట్టకేలకు గీతా పేరు వెనక ఉన్న అసలు కథ చెప్పేశారు నిర్మాత అల్లు అరవింద్. దివంగత సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇటీవల అలీతో సరదాగా షోలో పాల్గోన్న అల్లు అరవింద్ తన వ్యక్తిగత విషయాలే కాకుండా ఫ్యామిలీ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే గీతాఆర్ట్స్ బ్యానర్ పేరులో గీతా అంటే ఎవరో చెప్పారు.

గీతాఆర్ట్స్‏లో గీత ఎవరు ? ఆ పేరు వెనుక ఏదైనా కథ ఉందా ? అని అలీ అడగ్గా.. “గీతా ఆర్ట్స్ అనే పేరు పెట్టింది మా నాన్న. భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారు. ప్రయత్నం మాత్రమే మనది. ఫలితం మన చేతిలో ఉండదు. ఇది సినిమాలకు బాగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యడమే కానీ, ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అని గీతా పేరు పెట్టారు. ” అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

పెళ్లయిన తర్వాత నిర్మలా ఆర్ట్స్ అని పెట్టవచ్చు కదా అని అలీ అడగ్గా.. గీతా పేరు మీద తీసిన సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీ ఆడాయి. అందుకే మార్చాలన్న ఆలోచన మాకు రాలేదు. ఇంకొక విషయం ఏమిటంటే నేను చదువుకునే రోజుల్లో నాకు గీత అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. నా స్నేహితులు కూడా ఆ పేరుతో ఆటపట్టించేవారు అని తెలిపారు.