Dhanush-Aishwarya: మళ్లీ కలిసిపోతున్న ధనుష్ దంపతులు.. రూ. 100 కోట్ల ఇంట్లోకి ప్రవేశం ?..
ధనుష్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ పిల్లలు సంతోషంగా ఉండడం కోరుకుంటున్నట్లు చెప్పారు. దీంతో వీరిద్దరు కలిసిపోవడం నిజమేనని ఫ్యాన్స్ సంతోషపడిపోతున్నారు.
తమిళ్ స్టార్ హీరో ధనుష్.. ఐశ్వర్య రజనీకాంత్ జంట మళ్లీ కలవబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో తాము విడిపోతున్నామంటూ ప్రకటించి అందరికీ షాకిచ్చారు ధనుష్ దంపతులు. దాదాపు 18 బంధానికి తాము ముగింపు పలుకుతున్నట్లుగా చెప్పడంతో సినీ ప్రముఖులతోపాటు సాధారణ ప్రజలు సైతం షాకయ్యారు. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే వీరు విడాకుల తీసుకోవడం అటు ధనుష్ కుటుంబంలోగానీ.. ఇటు రజనీకాంత్ ఫ్యామిలీలో కానీ ఇష్టం లేదట. పిల్లల కోసమైన తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. మళ్లీ కలవాలంటూ రజనీకాంత్ కూతురు, అల్లుడికి నచ్చచెప్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ జంట పిల్లల కోసం మళ్లీ కలిసిపోవాలనుకుంటున్నారని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి స్పందన లేదు. ఇటీవల ధనుష్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ పిల్లలు సంతోషంగా ఉండడం కోరుకుంటున్నట్లు చెప్పారు. దీంతో వీరిద్దరు కలిసిపోవడం నిజమేనని ఫ్యాన్స్ సంతోషపడిపోతున్నారు.
ఇక తాజాగా ఈ జంట విడాకుల రద్దుపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. ధనుష్ ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నారని.. విడాకుల రద్దు ప్రకటన అనంతరం ఐశ్వర్య, పిల్లలతో కలిసి ఆ ఇంట్లోనే ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ధనుష్ ఖరీదు చేయబోయే ఇంటి విలువ రూ. 100 కోట్లు ఉంటుందట. వచ్చే ఏడాది ప్రారంభంలో ధనుష్.. భార్య పిల్లలతో కలిసి కొత్త ఇంటికి మకాం మార్చబోతున్నాడని టాక్. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
ధనుష్.. ఐశ్వర్య ఇద్దరూ 2004 నవంబర్ 18న ప్రేమ పెళ్లి చేసుకున్నారు… వీరికి యాత్రా రాజా, లింగరాజా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ధనుష్.. తెలుగులో సార్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని కలిగించాయి.