AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మిక ప్లేస్ కొట్టేసిన ఆ హీరోయిన్.. క్రేజీ ఛాన్స్ మిస్సయిన నేషనల్ క్రష్..

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో రాబోయే మూవీలో రష్మిక కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి.

Rashmika Mandanna: రష్మిక ప్లేస్ కొట్టేసిన ఆ హీరోయిన్.. క్రేజీ ఛాన్స్ మిస్సయిన నేషనల్ క్రష్..
Rashmika
Rajitha Chanti
|

Updated on: Oct 18, 2022 | 8:26 PM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‏ హీరోయిన్‏గా రష్మిక వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె చేతిలో తెలుగుతోపాటు హిందీ, తమిళంలో చేతినిండా సినిమాలున్నాయి. ఇటీవల గుడ్ బై సినిమాతో హిందీ ఆడియన్స్ ముందుకు రాగా.. ఈ మూవీ డిజాస్టర్‏గా నిలిచింది. ఇదే కాకుండా అటు హిందీలో యానిమల్, మిస్టర్ మజ్ను సినిమాలు చేస్తుండగా.. మరోవైపు తెలుగులో పుష్ప 2, తమిళంలో వరిసు సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమానే కాకుండా.. తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో రాబోయే మూవీలో రష్మిక కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ సమస్యల కారణంగా రష్మిక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విక్రమ్ రొమాంటిక్ ఇంట్రెస్ట్ పాత్రలో మాళవిక మోహనన్ ఎంపికైనట్లు తెలుస్తోంది.

మాళవిక మోహనన్ చివరిసారిగా ధనుష్ నటించిన మారన్‌లో కనిపించింది. ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది.ఇక ఇప్పుడు బంపర్ ఆఫర్ అందుకుంది మాళవిక. విక్రమ్, పా రంజిత్ సినిమాలో ఈ ముద్దుగుమ్మను ఎంపిక చేశారట. ఇక ఈ సినిమాలో 3డిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల, చియాన్ విక్రమ్ చెన్నైలో జరిగిన టెస్ట్ షూట్‌ను ప్రారంభించాడు. నివేదికల ప్రకారం చియాన్ 61 చిత్రం 2డి,3డిలో చిత్రీకరించనున్నారు అలాగే ఈ సినిమాను పాన్-ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మాళవికకు ఇది నాలుగో తమిళ చిత్రం. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం నుంచి కడపలో మొదలైంది. తమిళంతోపాటు హిందీలోనూ చిత్రీకరించనున్నారు. చివరిసారిగా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించారు విక్రమ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?
రూ. 10 కదాని లొట్టలేసుకుంటూ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే..
రూ. 10 కదాని లొట్టలేసుకుంటూ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే..
సీఎం సార్ స్మశానాల దగ్గర వైన్ షాపులు పెట్టండి
సీఎం సార్ స్మశానాల దగ్గర వైన్ షాపులు పెట్టండి
కొట్టి చంపేశారు.. కన్నీరుమున్నీరవుతోన్న 'శక్తి' హీరోయిన్.. వీడియో
కొట్టి చంపేశారు.. కన్నీరుమున్నీరవుతోన్న 'శక్తి' హీరోయిన్.. వీడియో