Purushothamudu OTT: రాజ్ తరుణ్ లేటెస్ట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. పురుషోత్తముడు స్ట్రీమింగ్ ఎందులోనంటే?

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ కథానాయకుడిగా న‌టించిన లేటెస్ట్ 'పురుషోత్త‌ముడు'. రామ్ భీమ‌న తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామాలో హాసిని సుధీర్ హీరోయిన్‌గా న‌టించింది. ర‌మ్య‌కృష్ణ‌, ప్ర‌కాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ త‌రుణ్- లావణ్యల వివాదం కారణంగా థియేట్రికల్ రిలీజుకు ముందే పురుషోత్తముడు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Purushothamudu OTT: రాజ్ తరుణ్ లేటెస్ట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. పురుషోత్తముడు స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Purushothamudu Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 29, 2024 | 12:16 PM

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ కథానాయకుడిగా న‌టించిన లేటెస్ట్ ‘పురుషోత్త‌ముడు’. రామ్ భీమ‌న తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామాలో హాసిని సుధీర్ హీరోయిన్‌గా న‌టించింది. ర‌మ్య‌కృష్ణ‌, ప్ర‌కాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ త‌రుణ్- లావణ్యల వివాదం కారణంగా థియేట్రికల్ రిలీజుకు ముందే పురుషోత్తముడు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్ నటీనటులు ఉండడంతో రాజ్ తరుణ్ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే జులై 26న థియేటర్లలో విడుదలైన పురుషోత్తముడు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. గతంలో మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు పోలిన కథా కథనాలు ఉండడంతో జనాలు రాజ్ తరుణ్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. చాలా మంది ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే పురుషోత్తముడు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా రాజ్ తరుణ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 29 నుంచే సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే పురుషోత్తముడు సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

శ్రీశ్రీదేవి ప్రొడక్షన్ బ్యానర్ పై డాక్టర్‌ రమేశ్‌ తేజవత్‌, ప్రకాశ్‌ తేజవత్‌ సంయుక్తంగా పురుషోత్త‌ముడు సినిమాను నిర్మించారు. సీనియర్ నటీనటులు బ్ర‌హ్మానందం, బ్ర‌హ్మాజీ, స‌త్య‌తో పాటు ప‌లువురు క‌మెడియ‌న్లు ఈ మూవీలో న‌టించారు. గోపీ సుందర్ బాణీలు సమకూర్చారు. పీజీ విందా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా, ఎడిటర్‌ గా మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ వ్యవహరించారు. కంపెనీ సీఈవో కావాలనుకునే యువకుడు 100 రోజుల్లో సామాన్యుడిలా జీవితం గడపడం అనే అంశం చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. గతంలో ఇదే కాన్సెప్టుతో మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమా వచ్చింది. ఇదే పురుషోత్తముడు సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. టైం పాస్ చేయాలనుకునేవారు ఒక సారి రాజ్ తరుణ్ సినిమాను చూడొచ్చు.

ఓటీటీలో వర్కవుట్ అవుతుందా?

ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా