OTT Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు ఇవే.. టాప్ ట్రెండింగ్ మూవీస్..
సాధారణంగా ప్రతి వారం కొత్త కొత్త జానర్ చిత్రాలు ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. హారర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వారం కూడా ఉత్కంఠభరితమైన థ్రిల్లర్, శక్తివంతమైన సినిమాలు విడుదలయ్యాయి. ఇంతకీ ఏ ఏ సినిమా వచ్చిందో చుద్ధామా.

ఓటీటీలో షెడ్యూల్ ప్రకారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలయ్యాయి. హారర్, సస్పెన్స్, మిస్టరీ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం కూడా సరికొత్త మూవీస్ అడియన్స్ ముందుకు వచ్చాయి. కాజోల్ బోల్డ్ కొత్త అవతారంలో అలరించేందుకు రెడీ అయ్యింది. అలాగే మండలా మర్డర్స్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. పంజాబీ, హిందీ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నారు. సర్జమీన్, మండలా మర్డర్స్, సౌంకన్ సౌంకనాయ్ 2 చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాయి. ఈ మూడు సినిమాలు జూలై 25 నుంచి డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చాయి.
1. సర్జమీన్.. జియో హాట్‌స్టార్ .. జూలై 25
బాలీవుడ్ నటి కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, మిహిర్ అహుజా ప్రధాన పాత్రలలో నటించిన సినిమా సర్జమీన్. ఇది దేశభక్తి థ్రిల్లర్. ఈ చిత్రానికి దీనికి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి ఒక సైనిక అధికారి చేసే పోరాటమే ఈ సినిమా. కాజోల్ ఇబ్రహీం పాత్రకు తల్లిగా భావోద్వేగ పాత్రను పోషిస్తుంది.
2. మండలా మర్డర్స్.. నెట్‌ఫ్లిక్స్.. జూలై 25..
నెట్‌ఫ్లిక్స్-యష్ రాజ్ ఫిల్మ్స్ సహకారంతో రూపొందిన మూవీ మండలా మర్డర్స్. ఇందులో వాణి కపూర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రియా థామస్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక సుర్వీన్ చావ్లా, శ్రియా పిల్గావ్‌కర్, రఘుబీర్ యాదవ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్ చరణదాస్‌పూర్ పురాతన రహస్యాలను రహస్యం, మానసిక కుట్రల గురించి తెలియజేస్తుంది.
3. సౌంకన్ సౌంకనాయ్ 2.. ZEE5.. జూలై 25..
బాలీవుడ్ స్టార్స్ అమీ విర్క్, సర్గున్ మెహతా, నిమ్రత్ ఖైరా ప్రధాన పాత్రలలో నటించిన పంజాబీ కామెడీ సౌంకన్ సౌంకనాయ్ 2. ఒక వ్యక్తి తల్లి అతనికి మూడవ భార్యను తీసుకువచ్చినప్పుడు జరిగే హాస్యభరితమైన కథే ఈ సినిమా. ప్రాంతీయ నాటకం, కడుపుబ్బా నవ్వించే క్షణాల అభిమానులకు ఇది సరైన ఎంపిక.
ఇవి కూడా చదవండి:
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!
Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..




