AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

God OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ.. నయనతార ‘గాడ్‌’ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార నటించిన చిత్రం ఇరైవన్‌. కోలీవుడ్ స్టార్‌ హీరో జయం రవి మరో కీలక పాత్ర పోషించాడు. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా సెప్టెంబర్‌ 28 తమిళంలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో రెండు వారాల తర్వాత అంటే అక్టోబర్‌ 13న తెలుగులో కూడా విడుదలైంది. గాడ్‌గా విడుదలైన ఈ మూవీ ఇక్కడ కూడా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

God OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ.. నయనతార 'గాడ్‌' స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
God Movie
Basha Shek
|

Updated on: Oct 26, 2023 | 12:07 PM

Share

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార నటించిన చిత్రం ఇరైవన్‌. కోలీవుడ్ స్టార్‌ హీరో జయం రవి మరో కీలక పాత్ర పోషించాడు. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా సెప్టెంబర్‌ 28 తమిళంలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో రెండు వారాల తర్వాత అంటే అక్టోబర్‌ 13న తెలుగులో కూడా విడుదలైంది. గాడ్‌గా విడుదలైన ఈ మూవీ ఇక్కడ కూడా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద బాగానే కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ గాడ్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ముందుగా నిర్ణయించిన టైమ్‌ ప్రకారం గురువారం (అక్టోబర్‌ 26) అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ గాడ్‌ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇక గాడ్‌ సినిమాలో నయన్‌, జయం రవి లతో వినోద్ కిషన్‌, రాహుల్ బోస్‌, విజయలక్ష్మి, నరైన్‌, ఆశిష్ విద్యార్థి,చార్లీ, అశ్విన్‌ కుమార్‌, భగవత్ పెరుమాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సిటీలో ఒక సైకో కిల్లర్ (రాహుల్ బోస్) అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి అతి క్రూరంగా చంపేస్తుంటాడు. అతనిని ఐపీఎస్‌ ఆఫీసర్‌ అర్జున్‌ (జయం రవి), స్నేహితుడు (నరైన్‌) కలిసి పట్టుకుంటారు. అయితే ఈ క్రమంలో నరైన్‌ చనిపోతాడు. దీనికి తోడు ఆ కిల్లర్‌ను పట్టుకున్న తర్వాత కూడా వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. మరి అసలు వాళ్లని చంపేది ఎవరు? ఎందుకు ఇలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? ప్రియ (నయనతార) పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే గాడ్‌ సినిమా చూడాల్సిందే. థియేటర్లలో ఈ సైకో థ్రిల్లర్‌ మూవీని మిస్‌ అయిన వారికి ఈ మూవీ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

గాడ్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us