అన్నంలో ఐస్‌క్రీమ్.. మృణాల్ ఫుడ్ చూసి తల పట్టుకుంటున్న ఫ్యాన్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

05 June 2026

సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'సీత'గా చెరగని ముద్ర వేసుకున్న బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తొలి చిత్రంతోనే క్రేజ్ సొంతం చేసుకుంది. 

ఆ తర్వాత 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.

కేవలం సినిమాలే కాకుండా, సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు షేర్ చేసే పోస్ట్‌లు, ఫోటోలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఆమె చేసిన పోస్ట్ వైరలవుతుంది. 

మృణాల్ వెల్లడించిన ఒక వింత సీక్రెట్ చూసి నెటిజన్లు, ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

మృణాల్ ఠాకూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన, అత్యంత విచిత్రమైన 'ఫుడ్ కాంబినేషన్' గురించి ఓపెన్ అయింది. ఆ విషయం తెలిసి షాకవుతున్నారు.

తనకు వేడివేడి అన్నంలో వెనిల్లా ఐస్‌క్రీమ్ వేసుకుని తినడం చాలా ఇష్టమని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ పెద్ద చర్చకే తెరలేపారు. "సీతమ్మ.. ఏంటమ్మా ఈ వింత ప్రయోగం?", "వేడి అన్నంలో ఐస్‌క్రీమ్ వేసుకుని ఎలా తింటారు

బాబోయ్!", "ఇది ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం, ఫుడ్‌పై ఇలాంటి ప్రయోగాలు చేయకండి" అంటూ నెటిజన్లు ఫన్నీగా తలలు పట్టుకుంటున్నారు.