AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. కోటి విలువైన నోట్లు.. కాలేజీ గదిలో చెదలు..

రూ. కోటి విలువైన నోట్లు.. కాలేజీ గదిలో చెదలు..

Phani CH
|

Updated on: Jun 05, 2026 | 5:36 PM

Share

కోల్‌కతాలోని సురేంద్రనాథ్ కళాశాలలో యూనియన్ రూమ్‌ను తెరిచిన అధికారులు షాకింగ్ విషయాలను గుర్తించారు. చెదలు పట్టిన రూ.1 కోటి నగదు, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, రివాల్వర్‌తో పాటు అన్ని సౌకర్యాలతో కూడిన రహస్య గదులు బయటపడటం సంచలనం సృష్టించింది. ఈ ఘటన రాజకీయంగా కూడా దుమారం రేపుతూ పోలీసు దర్యాప్తుకు దారి తీసింది.

కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక సురేంద్రనాథ్ కాలేజ్‌లో చెదలు పట్టిన రూ.1 కోటి క్యాష్‌ ఉన్న రెండు పెద్ద పెట్టెలు లభించాయి. వాటితో పాటు మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ కూడా దొరికాయి. గత ఏడాది జూన్‌లో లా కాలేజీలో 24 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం జరిగిన కొద్ది రోజులకే కీలక పరిణామం చోటుచేసుకుంది. కళాశాలల్లోని యూనియన్ రూమ్‌లను మూసివేయాలని కలకత్తా హైకోర్టు అప్పటి టీఎంసీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 2025లో ఆ గదికి తాళం వేశారు. అంతేకాదు విద్యార్థి సంఘం నిధుల నుంచి చేసే అన్ని ఖర్చులను ఆడిట్ చేయాలని సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కళాశాలలను కోరింది. దీంతో సురేంద్రనాథ్ కళాశాలలోని ఆ గదిని తెరవడంతో షాకింగ్‌ రహస్యాలు బయటపడ్డాయి. ఈ ఘటనతో కాలేజీ క్యాంపస్‌లో మరిన్ని సోదాలు నిర్వహించగా క్యాంపస్ లోపల ఏసీలు, అటాచ్డ్ బాత్రూమ్‌లు, పడకలు, ఖరీదైన పరుపులు, దిండ్లు అమర్చిన రెండు పడకగదులు బయటపడ్డాయి. టీఎంసి నాయకుడు దేబాశిస్, అతని కుమారుడు శిబాశిస్ ఆ గదులను ఉపయోగించుకున్నారని కళాశాల అధికారులు ఆరోపించారు. అంతేకాకుండా ఆ గదులలో ఆ ఇద్దరు నాయకులకు ఉద్యోగులతో మసాజ్‌లు చేయించేవారని వారు తెలిపారు. అయితే దేబాశిస్ బంద్యోపాధ్యాయ్ తనకు బెడ్ రూమ్‌ల గురించి తెలియదని ఆ ఆరోపణలను ఖండించారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో వీలైనంత త్వరగా కాలేజీని శుభ్రం చేయాలని సురేంద్రనాథ్ కాలేజీ యజమాన్యానికి మున్సిపల్ అధికారులు చెప్పారు. దాంతో యజమాన్యం కాలేజీని శుభ్రం చేసే పనులు మొదలెట్టింది. పనివారు కాలేజీని శుభ్రం చేస్తుండగా యూనియన్ రూములోని అల్మారాలో రెండు పెద్ద సూట్ కేసులు కనిపించాయి. పనివారు కాలేజీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రూము దగ్గరకు వచ్చిన కాలేజీ సిబ్బంది వాటిని తెరిచి చూడగా.. చెదలు పట్టిన రూ.100, 500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ డబ్బు విలువ రూ. కోటి వరకు ఉంటుందని అంచనా. చెదల కారణంగా నోట్ల కట్టలు చాలా దారుణంగా పాడైపోయి ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నోట్లు చాలా వరకు పాడైపోయి ఉన్నాయనీ దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు అన్నారు. ఎవరికీ తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డబ్బులు కాలేజీ యూనియన్ రూములోకి ఎలా వచ్చాయో దర్యాప్తు జరపాలనీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ బీజేపీ నేతలు డిమాండ్ చేసారు. డబ్బులు దొరికిన యూనియన్ రూములో అన్ని వసతులున్న ఓ సీక్రెట్ రూము బయటపడటం కలకలం రేపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మృగశిర కార్తె సందడి.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా

Weather Update: ఆ.. 17 రాష్ట్రాలకు హై అలర్ట్‌.. ఆకాశం నుండి ఊడిపడనున్న గండం

Peddi: కన్నడ కిర్రాక్‌ కలెక్షన్స్‌.. నెంబర్‌ 1గా హీరో మనోడే..!

Peddi: టికెట్స్ తెగడంలో.. పెద్ది రికార్డ్

Follow Us