మృగశిర కార్తె సందడి.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లో బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తుండగా, గోదావరి జిల్లాల్లో పేదల కోసం భారీ ఉచిత ఆక్వా విందు నిర్వహించనున్నారు. చేపల ధరలు అధికంగా ఉండటంతో నిరుపేదలు కూడా ఈ సంప్రదాయాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో నాటు చేపల కూరలు, రొయ్యల వంటకాలతో ప్రత్యేక భోజనాన్ని ఉచితంగా అందించనున్నారు.
మృగశిర కార్తె రాకతో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి మొదలైంది. “మృగశిర కార్తెలో ముక్క లేనిదే ముద్ద దిగదు” అనే సామెత ప్రకారం.. ఎండ తీవ్రత తగ్గి వర్షాకాలం ఆరంభమయ్యే జూన్ 8వ తేదీన చేపలు తినడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది మృగశిర కార్తె పర్వదినం అటు భాగ్యనగరంలో ప్రాముఖ్యతను చాటుకుంటూనే, ఇటు గోదావరి జిల్లాల్లో మానవత్వానికి సరికొత్త వేదికగా మారబోతోంది. ఒకవైపు హైదరాబాద్‌లో దశాబ్దాల సాంప్రదాయం ప్రకారం ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల కోసం బత్తిని కుటుంబీకులు అందించే ప్రసిద్ధ ‘చేప ప్రసాదం’ పంపిణీకి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుండి లక్షలాది మంది రోగులు దీని కోసం తరలిరానున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్తగా ఒక అద్భుతమైన ‘ఆక్వా విందు’కు శ్రీకారం చుట్టారు. మృగశిర కార్తె రోజున మార్కెట్‌లో చేపల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల నిరుపేదలు వాటిని కొనలేరు. ఈ విషయాన్ని గ్రహించిన పశ్చిమ గోదావరి జిల్లా ‘జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం’ ఆధ్వర్యంలో పాలకొల్లు, నరసాపురం, ఆచంట ప్రాంతాలలో పేదల కోసం భారీ ఉచిత విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆక్వా రంగానికి పుట్టినిల్లైన గోదావరి జిల్లాల్లో ఏ ఒక్క పేదవాడు కూడా ఈ రోజున చేపల కూర తినకుండా ఉండకూడదనే సత్సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోరూరించే రకరకాల నాటు చేపల కూరలు, ఫ్రైలతో పాటు గోదావరి స్పెషల్ రొయ్యల ఇగురులతో కూడిన కమ్మని భోజనాన్ని పేదలకు ఉచితంగా వడ్డించనున్నారు. ఒకే రోజున వ్యాధి నివారణ కోసం ఒకచోట, ఆకలి తీర్చడం కోసం మరోచోట జరుగుతున్న ఈ రెండు కార్యక్రమాలు తెలుగు వారి సంస్కృతిని, మానవత్వాన్ని చాటిచెబుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update: ఆ.. 17 రాష్ట్రాలకు హై అలర్ట్.. ఆకాశం నుండి ఊడిపడనున్న గండం
Peddi: కన్నడ కిర్రాక్ కలెక్షన్స్.. నెంబర్ 1గా హీరో మనోడే..!
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..

