AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రోడ్డుపై ఓ మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు.. సీన్ కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!

Viral Auto Driver Video: ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. చిన్న చిన్న వీడియోలు కూడా తెగ నవ్విస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆటో డ్రైవర్ వీడియో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా నవ్వకుండా ఉండలేరు.

Video: రోడ్డుపై ఓ మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు.. సీన్ కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!
Viral Auto Driver Video
Venkata Chari
|

Updated on: Jun 06, 2026 | 7:11 AM

Share

Viral Auto Driver Video: ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న వింతలు, విశేషాలు సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై ప్రయాణించేటప్పుడు మనకు ఎదురయ్యే కొన్ని సంఘటనలు గుండెకు హత్తుకునేలా ఉంటే, మరికొన్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తుంటాయి. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌పై షేర్ అయిన ఒక ఆటో డ్రైవర్ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. “ఆటో వాలా ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు” అంటూ ఒక యూజర్ సరదాగా షేర్ చేసిన ఈ చిన్న క్లిప్, డిజిటల్ ప్రపంచంలో నవ్వుల పూలు పూయిస్తోంది. అసలు ఆ ఆటోలో ఏం జరిగింది? ఆ డ్రైవర్ ఎందుకు అంతలా ఆశ్చర్యపోయాడు? అనే ఆసక్తికరమైన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రోడ్డుపై వింత సంఘటన: ఆటో డ్రైవర్ ఆశ్చర్యానికి కారణమేంటి?

సాధారణంగా నగరాల్లో ప్రయాణించేటప్పుడు ఆటో డ్రైవర్లు రకరకాల ప్రయాణికులను చూస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఒక వ్యక్తి రోడ్డుపై బస్తాతో నిల్చుని ఉంటాడు. ఇంతలో ఓ ఆటో అటుగా వస్తుంది. ఈ క్రమంలో రోడ్డుపై నిల్చున్న వ్యక్తి ఆటోను ఆపుతాడు. ఈక్రమంలో ఆటో డ్రైవర్, ఆటో ఎక్కుతాడని, బస్తాను వెనుకాల వేయడానికి సహాయం చేసేందుకు డోర్ ఓపెన్ చేసి, ఆ వ్యక్తి దగ్గరకు వస్తాడు. ఆవ్యక్తి బస్తాను పైకి ఎత్తమని చెబుతాడు. ఇక్కడే ఆటో డ్రైవర్ కంగుతింటాడు. ఆ వ్యక్తి తలపై బస్తాను ఎత్తుకుని జాలీగా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. ఇది చూసి ప్రయాణికులతోపాటు ఆటో డ్రైవర్ షాకవ్వడం లాస్ట్ ట్విస్ట్ అన్నమాట.

వైరల్ వీడియో..

రోడ్డుపై వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఊహించని ట్విస్ట్ ఎదురవడంతో, ఆటో డ్రైవర్ ముఖంలో కనిపించిన ఎక్స్‌ప్రెషన్స్ ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖంలో ఒకవైపు నవ్వు, మరోవైపు ‘ఏం జరుగుతోంది ఇక్కడ?’ అనే అమాయకత్వం అసలైన వినోదాన్ని పంచుతున్నాయి.

సోషల్ మీడియాలో నెటిజన్ల ఫన్నీ కామెంట్ల వర్షం..

ఈ వీడియో ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ అయిన కొద్దిసేపటికే వేలాది వ్యూస్, లైకులతో దూసుకుపోతోంది. ఈ ఫన్నీ మీమ్ మెటీరియల్‌లా మారిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

“పాపం ఆటో అన్న.. మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది!” అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు.

“జీవితంలో ఎన్నో చూసుంటాడు కానీ.. ఇలాంటి క్రేజీ కస్టమర్‌ను మాత్రం ఇదే మొదటిసారి చూసి ఉంటాడు” అంటూ మరొకరు రాసుకొచ్చారు.

మరికొందరు ఈ వీడియోను మీమ్స్ రూపంలో మారుస్తూ, ప్రస్తుత ట్రెండ్‌కు కనెక్ట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ అమాయకపు చూపులను చూసి నవ్వకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కావడం లేదు.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us