Peddi Movie : టోక్యో నుంచి హైదరాబాద్‌కు.. మూడు రోజుల్లో పదిసార్లు పెద్ది సినిమా చూస్తాం.! : చరణ్ జపాన్ లేడీ ఫ్యాన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

సినిమా అంటే ఇష్టం ఒకటి… అభిమాన హీరో కోసం ఖండాలు దాటి రావడం మరోటి. అలాంటి అరుదైన అభిమానాన్ని చాటుకున్నారు జపాన్‌కు చెందిన ఇద్దరు యువకులు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది చిత్రాన్ని పెద్ద తెరపై చూసేందుకు ఏకంగా జపాన్ రాజధాని టోక్యో నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మసామి, క్రిస్ అనే ఈ ఇద్దరు అభిమానులు తమ ఉద్యోగాలకు ఐదు రోజుల సెలవు పెట్టి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్న వీరు, తమ ప్రయాణ లక్ష్యం ఒక్కటేనని చెబుతున్నారు… అదే ‘పెద్ది’ని థియేటర్లలో పదిసార్లు చూడడం!
విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన వీరు, మల్టీప్లెక్స్‌లు మాత్రమే కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా సినిమా చూసి, తెలుగు ప్రేక్షకుల అసలైన థియేటర్ సంబరాలను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జపాన్‌లోనూ భారతీయ సినిమాలకు అభిమానులున్నప్పటికీ, హైదరాబాద్‌లో కనిపించే అభిమానుల హంగామా, సంబరాలు ప్రత్యేకమని చెప్పారు.
హైదరాబాద్‌కు చేరుకున్నప్పటి నుంచి వీరు స్థానిక అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోల్లో మసామి, క్రిస్‌లు రామ్ చరణ్ పోస్టర్లతో ఫొటోలు దిగుతూ, అభిమానులతో కలిసి నినాదాలు చేస్తూ కనిపించారు. అంతేకాదు, ‘రయ్ రయ్ రా రా’, ‘మాసా మాసా’ పాటలను స్థానిక అభిమానులతో కలిసి ఆలపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు సినిమాలకు విదేశాల్లో పెరుగుతున్న ఆదరణకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. ఒక హీరో సినిమా కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి, పదిసార్లు సినిమా చూసేందుకు సిద్ధమవడం సాధారణ విషయం కాదు. ‘పెద్ది’ విడుదల సందర్భంగా జపాన్ అభిమానుల ఈ ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
