TTD: రికార్డ్ స్థాయిలో తిరుమల లడ్డూ విక్రయాలు.. ఒక్క మే నెలలోనే..
తిరుమలలో ఈ ఏడాది వేసవి రద్దీ మధ్య శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్రయమయ్యాయని టీటీడీ వెల్లడించింది. రోజుకు లక్షల సంఖ్యలో లడ్డూలు తయారు చేస్తూ, సంప్రదాయ నాణ్యతను కాపాడేందుకు ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది వేసవి రద్దీలో సరికొత్త ఆల్‌టైమ్ రికార్డులను తిరగరాసింది. శ్రీవారి దర్శనాలు, హుండీ ఆదాయంతో పాటు భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2026 మే నెలలో రికార్డు స్థాయిలో మొత్తం కోటీ 21 లక్షల 35 వేల 528 లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. 2024 మేలో 1.01 కోట్లు, 2025 మేలో 1.10 కోట్ల లడ్డూలు అమ్ముడవ్వగా.. ఈ ఏడాది ఆ రికార్డులన్నీ బద్దలయ్యాయి. భక్తుల రద్దీకి తగ్గట్టుగా రోజుకు సగటున 4 లక్షల 8 వేల లడ్డూలను పోటు కార్మికులు తయారు చేస్తున్నారు. ఇందుకోసం రోజుకు సుమారు 68 టన్నుల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారు. ఇందులో రోజువారీగా 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శెనగపిండి, 16 టన్నుల నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండుద్రాక్ష, 400 కిలోల యాలకులు, 800 కిలోల కలకండ వాడుతున్నారు. ప్రతీ చిన్న లడ్డూ 167 నుండి 170 గ్రాముల బరువు ఉండేలా దిట్టం పాటిస్తున్నారు. 1950-51 నాటి సాంప్రదాయ దిట్టం ప్రకారమే నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ప్రసాదాలు తయారు చేస్తున్నారు. లడ్డూ నాణ్యత కోసం భారత ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు, FSSAI లైసెన్స్ కూడా ఉన్నాయి. ముడిసరుకుల్లో మలినాలను తొలగించడానికి ల్యాబ్ పరీక్షలతో పాటు, పోటులో రెండు అత్యాధునిక ఏఐ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. శ్రీవారి పోటులో రెండు షిఫ్టుల్లో 700 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణులు నిరంతరాయంగా లడ్డూలు తయారు చేస్తున్నారు. లడ్డూ కాంప్లెక్స్‌లో 56 కౌంటర్ల ద్వారా 24 గంటలూ పంపిణీ జరుగుతోంది. అదనపు లడ్డూల కోసం డిజిటల్ కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. దర్శనం చేసుకున్న ప్రతీ భక్తునికీ ఒక లడ్డూను ఉచితంగా ఇస్తున్నారు. భక్తుల రద్దీ పెరిగినా కొరత రాకుండా ఎల్లప్పుడూ 8 నుండి 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 ఏళ్ల క్రితం హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. ! లొంగిపోయిన కిల్లర్
రూ. కోటి విలువైన నోట్లు.. కాలేజీ గదిలో చెదలు..
మృగశిర కార్తె సందడి.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా
Weather Update: ఆ.. 17 రాష్ట్రాలకు హై అలర్ట్.. ఆకాశం నుండి ఊడిపడనున్న గండం
Peddi: కన్నడ కిర్రాక్ కలెక్షన్స్.. నెంబర్ 1గా హీరో మనోడే..!
హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. లొంగిపోయిన కిల్లర్
రూ. కోటి విలువైన నోట్లు.. కాలేజీ గదిలో చెదలు..
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు

