AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మేమంతా చనిపోతున్నాం..’ అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్‌..

‘మేమంతా చనిపోతున్నాం..’ అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్‌..

Phani CH
|

Updated on: Jun 05, 2026 | 6:26 PM

Share

ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్ అగ్నిప్రమాదం హృదయ విదారకంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబ పెద్దకు దగ్గరగా ఉండేందుకు వచ్చిన గుర్‌గ్రామ్ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మంటల్లో ప్రాణాలు కోల్పోయారు. భద్రతా లోపాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం ఈ విషాదానికి కారణమని విచారణలో తేలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించడం అందరినీ కలచివేసింది. తండ్రి చికిత్స కోసం ఆసుపత్రికి దగ్గరగా ఉండాలని గుర్‌గ్రామ్ నుంచి వచ్చిన ఆ కుటుంబం.. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు పొగొట్టుకోవడం షాకయ్యేలా చేస్తోంది. ఫ్లరిష్ స్టే బీ అండ్ బీ హోటల్‌లో మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐదుంతస్తుల ఇరుకైన భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారికి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ప్రమాదంలో 12 మంది విదేశీయులు చనిపోయారు. గుర్‌గ్రామ్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్, ఆయన భార్య తరణి, తల్లి ప్రేమలత, ఇద్దరు కుమార్తెలతో పాటు ఇద్దరు బంధువులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రెండు తరాలు ఈ ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయాయి. వివేక్ తండ్రి 80 ఏళ్ల రాధేశ్యామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, ఆయనకు దగ్గరగా ఉండేందుకు కుటుంబం సమీపంలోని హోటల్‌లో బస చేసింది. తండ్రిని చూసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన ఆ ప్రయాణం విషాదంగా మారింది. తరుణి అగర్వాల్ వైపు నుంచి వచ్చిన ముగ్గురు బంధువులు కూడా అదే హోటల్‌లో ఉండగా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అయితే రాధేశ్యామ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికే అతని భార్య, కుమారుడు, కోడలు, మనవళ్లు, బంధువుల మృతదేహాలు చేరిన పరిస్థితి కుటుంబాన్ని కుదిపేసింది. ఈ విషాదంలో మరణానికి ముందు చివరి క్షణాలను కుటుంబ సభ్యుడు పునీత్ గుప్తా గుర్తుచేసుకున్నారు. మంటల సమయంలో వివేక్ అగర్వాల్ చివరిసారిగా ఫోన్ చేసి ‘బహుశా..ఇక మేం బతకకపోవచ్చు’ అని చెప్పినట్లు సమాచారం. తడి రుమాలు ముఖానికి పెట్టుకోవాలని సూచించినా.. పరిస్థితి దారుణంగా మారినట్లు తెలిపారట. ఈ ఘటన తర్వాత జరిగిన విచారణలో హోటల్‌లో తీవ్ర భద్రతా లోపాలు బయటపడ్డాయి. చిన్న సైజ్‌ కిటికీలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్న వారెవరూ బయటకు రాలేకపోయారు. కొన్ని కిటికీలు పూర్తిగా మూసేసి ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా బీ అండ్ బీ విధానంలో ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉండగా, 25 గదులు వారు అద్దెకు ఇచ్చినట్లు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో అనుమతి లేకుండా రెస్టారెంట్ నడపడం, బేస్‌మెంట్‌లో సరైన ఎగ్జిట్ లేకపోవడం, భవనం చుట్టూ విద్యుత్ తీగలు అడ్డుగా ఉండటం సహాయక చర్యలకు ఆటంక కలిగించాయి. ఈ కేసులో హోటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలిచివేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD: రికార్డ్‌ స్థాయిలో తిరుమల లడ్డూ విక్రయాలు.. ఒక్క మే నెలలోనే..

40 ఏళ్ల క్రితం హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. ! లొంగిపోయిన కిల్లర్

రూ. కోటి విలువైన నోట్లు.. కాలేజీ గదిలో చెదలు..

మృగశిర కార్తె సందడి.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా

Weather Update: ఆ.. 17 రాష్ట్రాలకు హై అలర్ట్‌.. ఆకాశం నుండి ఊడిపడనున్న గండం

Follow Us