AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊపిరి ఆడటం లేదని వేడుకున్నా కనికరించలేదు

ఊపిరి ఆడటం లేదని వేడుకున్నా కనికరించలేదు

Phani CH
|

Updated on: Jun 05, 2026 | 6:28 PM

Share

బ్రిటన్‌లో జరిగిన ఓ విషాద ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. కత్తిపోట్లతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి సహాయం చేయాల్సిన పోలీసులు, నిందితుడి మాటలు నమ్మి బాధితుడికే బేడీలు వేశారు. అనంతరం యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాడీక్యామ్ వీడియో బయటకు రావడంతో ఈ ఘటన జాతీయ చర్చగా మారింది.

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడికి సహాయం చేయాల్సింది పోయి, పోలీసులు అతడికే బేడీలు వేసిన అమానవీయ ఘటన బ్రిటన్‌లో జరిగింది. దీనికి సంబంధించిన పోలీసు బాడీక్యామ్ ఫుటేజ్ బయటకు రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దక్షిణ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ నగరంలో విక్రమ్ దిగ్వా అనే భారత సంతతి సిక్కు యువకుడు, 18 ఏళ్ల హెన్రీ నోవాక్‌ను కత్తితో దారుణంగా పొడిచాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి, తనపై జాతి వివక్ష దాడి జరిగిందని నాటకమాడాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దిగ్వా మాటలను గుడ్డిగా నమ్మేశారు. రక్తపు మడుగులో పడివున్న హెన్రీ.. “నన్ను కత్తితో పొడిచారు, నాకు ఊపిరి ఆడటం లేదు” అని వేడుకుంటున్నా పట్టించుకోకుండా, అతడికే బేడీలు వేశారు. హెన్రీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కోర్టు విచారణలో దిగ్వా ఆడిన నాటకం బట్టబయలైంది. హత్యకు ఉపయోగించింది 8 అంగుళాల పెద్ద కత్తి అని తేలింది. కోర్టు దిగ్వాకు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా, విపక్షాలు ‘ద్వంద్వ ప్రమాణాల పోలీసింగ్’ అంటూ విమర్శలు గుప్పించాయి. తప్పుదోవ పట్టామని అంగీకరించిన పోలీసులు హెన్రీ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘మేమంతా చనిపోతున్నాం..’ అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్‌..

TTD: రికార్డ్‌ స్థాయిలో తిరుమల లడ్డూ విక్రయాలు.. ఒక్క మే నెలలోనే..

40 ఏళ్ల క్రితం హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. ! లొంగిపోయిన కిల్లర్

రూ. కోటి విలువైన నోట్లు.. కాలేజీ గదిలో చెదలు..

మృగశిర కార్తె సందడి.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా

Follow Us