ఆటోలో 15 మందా? పాతబస్తీలో డేంజర్ జర్నీ!
హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆటోలో ఏకంగా 15 మంది ప్రయాణించడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. బర్కాస్ నుంచి సాదత్‌నగర్ వెళ్తున్న ఆటోలో నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ప్రమాద భయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ల అత్యాశ, ప్రయాణికుల నిర్లక్ష్యం కలిసి రోడ్డు భద్రతకు ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాసుల కక్కుర్తితో కొందరు ఆటోవాలాలు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పోలీసులు ఎంత మొత్తుకున్నా వారి సూచనలను పెడచెవిన పెడుతూ పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని అత్యంత ప్రమాదకర స్థితిలో ఆటోలు నడుపుతున్నారు. సమయాభావంతోనో.. మరో కారణంతోనో ప్రయాణికులు కూడా ఇలాంటివారిని ప్రోత్సహించడం బాధాకరం. హైదరాబాద్ పాతబస్తీలో ఒక్క ఆటోలో ఏకంగా 15 మందిని ఎక్కించుకొని ప్రయాణిస్తున్న దృశ్యాలు స్థానికులను ఆందోళనకు గురిచేసాయి. నిబంధనల ప్రకారం ఆటోలో డ్రైవర్‌తో పాటు నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ప్రయాణించాలి. కానీ, పాతబస్తీలోని బర్కాస్ నుండి సాదత్‌నగర్ వైపు ఓ ఆటో వెళ్తోంది. అందులో ఏకంగా 15 మంది ప్రయాణికులు ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ కనిపించారు. అది చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ సీటుకు ఇరువైపులా కూర్చోవడమే కాకుండా, వెనుక భాగంలో ఒకరిపై ఒకరు అన్నట్లుగా ప్రయాణికులను ఎక్కించుకుని ఆటో రోడ్లపై దూసుకుపోతోంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే డ్రైవర్ల అత్యాశ, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ఆటోలో సామర్థ్యానికి మించి ఇలా ఓవర్‌లోడ్ చేయడం వల్ల ఏ చిన్న మలుపు వద్దనైనా లేదా అకస్మాత్తుగా బ్రేక్ వేసినా ఆటో పల్టీ కొట్టే ప్రమాదం ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రూట్‌లో ఇలాంటి అడ్డగోలు ప్రయాణాలు పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ ఓవర్‌లోడ్ ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని వాహనదారులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు ఉల్లంఘించే ఆటోలను సీజ్ చేయాలని, అలాగే ప్రమాదకరమని తెలిసి కూడా ఆటోలు ఎక్కుతున్న ప్రయాణికుల్లోనూ అవగాహన రావాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చదివింది పది.. చేసేది లింగ నిర్ధారణ
‘మేమంతా చనిపోతున్నాం..’ అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్..
TTD: రికార్డ్ స్థాయిలో తిరుమల లడ్డూ విక్రయాలు.. ఒక్క మే నెలలోనే..
40 ఏళ్ల క్రితం హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. ! లొంగిపోయిన కిల్లర్
చదివింది పది.. చేసేది లింగ నిర్ధారణ
‘మేమంతా చనిపోతున్నాం..’ అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్..
హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. లొంగిపోయిన కిల్లర్
రూ. కోటి విలువైన నోట్లు.. కాలేజీ గదిలో చెదలు..
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!

