AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

భారతీయులకు బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.. కష్టకాలంలో ఆదుకునే నమ్మకమైన ఆర్థిక భరోసా. గత ఏడాది కాలంగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ, సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు.. తాజాగా కొద్దిగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన మార్పులతో దేశీయంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే...?

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?
Gold and Silver Prices: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. అంతర్జాతీయ సంకేతాలు విలువైన లోహాల ధరల పెరుగుదలకు దారితీశాయి. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు తిరిగి బంగారం, వెండి వైపు ఆకర్షితులయ్యారు.
Krishna S
|

Updated on: Jun 06, 2026 | 7:03 AM

Share

బంగారం అంటే భారతీయులకు ఓ ప్రత్యేక సెంటిమెంట్. అభరణంగా మాత్రమే కాకుండా కష్టకాలంలో ఆదుకునే ఆర్థిక భరోసాగా నిలుస్తుంది. ఇక గత ఏడాది కాలంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తూ సామాన్యులకు బిగ్ షాక్ ఇస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. శనివారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.10 తగ్గి రూ.1,57,220గా ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,42,740గా ఉంది. ఈ నెలలో ఇప్పటివరకు ఇదే కనిష్ట స్థాయిగా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి వినియోగదారులకు, ట్టుబడిదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

దేశవ్యాప్తంగా ఇలా

దేశవ్యాప్తంగా వివిధ మెట్రో నగరాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. చెన్నై నగరం ఎప్పటిలాగే అత్యంత ఖరీదైన మార్కెట్‌గా నిలిచింది. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,950గా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో రూ.1,55,870 గా ఉంది. ముంభై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో బంగారం ధరలు హైదరాబాద్ ధరలతో సమానంగా ఉన్నాయి.

వెండి ధరలు

వెండిధరలు సైతం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌, విజయవాడలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.2,79,900గా ఉంది. అయితే ఢిల్లీలో హైదరాబాద్ కంటే రూ.5000 తక్కువ ఉండడం గమనార్హం. చెన్నై, కేరళలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే బెంగళూరులో మాత్రం కేజీ వెండి ధర రూ.2,74,000గా ఉంది.

తగ్గుతూ వస్తున్న గోల్డ్

ప్రస్తుత జూన్ నెల ప్రారంభం నుండి పసిడి ధరల గ్రాఫ్ నిరంతరం క్షీణిస్తూ వస్తోంది. జూన్ 1వ తేదీన గరిష్ట స్థాయిలో ఉన్న ధరలు.. నేటికి వచ్చేసరికి 0.32శాతం మేర పతనమయ్యాయి. జూన్ 1న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 ఉండగా, నేడు అది రూ.1,57,220కి పడిపోయింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా జూన్ 1న రూ.1,43,200గా నమోదైంది.

తగ్గుదలకు కారణాలు

అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాల ప్రభావం పసిడి మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. డాలర్ ఇండెక్స్ బలంగా పుంజుకోవడం కూడా బంగారం ధరల క్షీణతకు ఒక ముఖ్య కారణంగా చెబుతున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని, బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయమని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్