స్టార్ హీరోయిన్ ఇంట్లో లింగ భైరవి దేవి పూజ.. పట్టు చీరలో బ్యూటీ..

Rajitha Chanti

Pic credit - Instagram

05 June 2026

మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ పాత్రలకే కాకుండా ఆధ్యాత్మికతకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. షూటింగ్స్ ఎంత బిజీగా ఉన్నా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటూ ఉంటారు.

సద్గురు జగ్గీ వాసుదేవ్ స్థాపించిన 'ఈశా ఫౌండేషన్' తో తమన్నాకు ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది. ఈశాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో ఆమె కనిపిస్తుంటారు.

తాజాగా తమన్నా ముంబైలోని తన సొంత నివాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో 'లింగ భైరవి దేవి' పుణ్యపూజను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

దేవి అనుగ్రహం ఇల్లంతటా నిండి ఉండాలని, కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఆమె ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ పూజకు సంబంధించిన ఫోటోలలో తమన్నా సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించి, ఎంతో పద్ధతిగా పూజలో కూర్చుని కనిపించారు.

గృహంలో ప్రత్యేకంగా అలంకరించిన పీఠంపై లింగ భైరవి దేవి స్వరూపాన్ని ఉంచి, ప్రత్యేక అర్చనలు, హారతులు నిర్వహించారు. కుటుంబం మొత్తం పాల్గొన్నారు.

ఈ పూజా విధానం, దేవి రూపం ఇంటికి ఒక ప్రత్యేకమైన సాత్విక వాతావరణాన్ని, సానుకూల శక్తిని (Positive Energy) తీసుకువచ్చినట్లు తమన్నా పేర్కొన్నారు.

ప్రస్తుతం తమన్నాకు సంబంధించిన ఈ పూజా ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె భక్తిభావానికి ఫిదా అవుతున్నారు.