AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: పవన్ కళ్యాణ్‌లో నచ్చేది అదే.. ఆరడుగుల బంగారం.. టాలీవుడ్ హీరోలపై బన్నీ కామెంట్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతుండడంతో.. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇటీవలే బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు బన్నీ. ఈ టాక్ షో ఎపిసోడ్ శుక్రవారం అర్థరాత్రి నుంచి జరుగుతుంది.

Allu Arjun: పవన్ కళ్యాణ్‌లో నచ్చేది అదే.. ఆరడుగుల బంగారం.. టాలీవుడ్ హీరోలపై బన్నీ కామెంట్స్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Nov 15, 2024 | 11:10 AM

Share

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‏గా అన్‎స్టాపబుల్ టాక్ షో వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంకాగా.. ఇప్పుడు నాలుగో సీజన్ వచ్చేసింది. ఈ షో నాల్గవ ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా అన్ స్టాపబుల్ టాక్ షోలో బాలయ్యతో కలిసి సందడి చేశాడు బన్నీ. అలాగే తన స్కూల్, ఫ్రెండ్స్, గోవాలో వైన్ షాప్, టాలీవుడ్ హీరోస్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు అంటే తనకు చాలా గౌరవం అని అన్నారు బన్నీ. మహేష్ కమ్ బ్యాక్ అద్భుతంగా ఉంటుందని.. ప్రతిసారి మెస్మరైజ్ చేస్తుంటాడని అన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయనలో ధైర్యం నచ్చుతుందని.. అవతల ఉన్నది ఎవ్వరని కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతుంటాడని.. ఆ ధైర్యం చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇక తన స్నేహితుడు ప్రభాస్ గురించి చెబుతూ.. డార్లింగ్ ఆరడగుల బంగారం అని.. క్రిస్మస్ డెకరేషన్ అంటే తనకు చాలా ఇష్టమని తెలుసుకుని ప్రత్యేకంగా బహుమతులు పంపించాడని అన్నారు. ఇక ఇండస్ట్రీలో తనకు ఎవరు పోటీ కాదని.. తనకు తానే పోటీ అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే తనకు వచ్చిన నేషనల్ అవార్డును తెలుగు హీరోలందరికీ డెడికేట్ చేస్తున్నట్లు తెలిపాడు బన్నీ. ఇప్పటివరకు ఈ మాట ఎక్కడ చెప్పలేదని.. టాలీవుడ్ హీరోలందరి తరుపున తనకు ఆ అవార్డు వచ్చినట్లు ఫీల్ అవుతున్నాని అన్నారు. దీంతో బాలయ్య వెంటనే బన్నీని హాగ్ చేసుకున్నారు. నేషనల్ అవార్డును టార్గెట్ గా పెట్టుకుని పుష్ప సినిమాలో ప్రతి షాట్, ప్రతి సీన్ షూటింగ్ చేశామని అన్నారు. కమర్షియల్ సినిమాలంటే చిన్న చూపు ఉందని.. కానీ అందరూ ఆదరించేవి అవే సినిమాలని అన్నారు. వాటికి అవార్డు వస్తే గౌరవం పెరుగుతుందని.. అందుకే పుష్ప సినిమాకు ఎలాగైన అవార్డు రావాలనుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..