AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: వాయమ్మో.. ఈ సినిమా చూడాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే.. భయానక హారర్ మూవీ..

హారర్ మూవీస్ చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. కొన్నాళ్లుగా ఓటీటీల్లో అనేక హారర్, మిస్టరీ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి తెలిస్తే షాకవుతుంటారు. దెయ్యంతో స్నేహం.. ఊహించని ట్విస్టులు.. రాత్రిళ్లు భయపెట్టించే మంత్రెగత్తే ఇలా ఎన్నో మలుపులతో అనుక్షణం భయపెట్టించే సినిమా.

OTT: వాయమ్మో.. ఈ సినిమా చూడాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే.. భయానక హారర్ మూవీ..
His House
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2024 | 1:48 PM

Share

హాలీవుడ్ సినిమాలను భారతీయ సినీప్రియులు ఎంతగా ఆదరిస్తారో చెప్పక్కర్లేదు. కంటెంట్ నచ్చితే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలకు పట్టం కట్టేస్తారు. కేవలం హాలీవుడ్ మూవీస్ కాదు.. హారర్ కంటెంట్ అంటే మన ఇండియన్ మూవీస్ చూసేందుకు కూడా అడియన్స్ అంతే ఉత్సాహంగా చూస్తుంటారు. రొమాంటిక్, కామెడీ చిత్రాలే కాకుండా హారర్, మిస్టరీ మూవీస్ కూడా అదే స్థాయిలో అంచనాలు, ఆసక్తిని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా హాలీవుడ్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలా ఈరోజు మనం చూడబోయే సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. మరి ఆ సినిమా ఏంటో చూద్దాం.ఈ హారర్ మూవీని చూసేందుకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అదే ‘His House (అతడి ఇల్లు)’.

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రెమీ వీక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో విడుదలైన హారర్ చిత్రం. ఫెలిసిటీ ఎవాన్స్, టోబి వెనబుల్స్ వంటి వారు రాసిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. యుద్ధం కారణంగా సూడాన్ నుండి పారిపోతున్న శరణార్థి జంట తమ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వేరే నగరానికి ఎలా వెళుతుంది అనే దానితో సినిమా ప్రారంభమవుతుంది. ‘బోల్‌, రియాల్‌’ అనే రెండు పాత్రల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. పారిపోయిన ఈ శరణార్థులకు బ్రిటీష్ ప్రభుత్వం పాత ఇళ్ల పట్టణ ప్రాంతాన్ని కేటాయిస్తుంది. మొదట్లో చక్కగా ఉన్న ఇల్లు కాస్త వింతగా దెయ్యంగా మారుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటిని ఒక భయంకరమైన దుష్టశక్తి ఆవహించిందని వారు భావిస్తారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న దుష్టశక్తిని దానిని పక్కింటి మహిళకు ఇస్తారు. అయితే ఒక రాత్రి మంత్రగత్తే కారణంగా రాత్రిళ్లు ఎక్కుగా బాధపడుతుంటారు. అయితే ఆ దెయ్యాన్ని బంధించడం కాకుండా దానితో స్నేహం చేయాలనుకుంటారు.

ఆ దెయ్యాన్ని ఎలా మచ్చిక చేసుకున్నారు. ? ఎలా ఆ ఇంటి నుంచి ఆ దెయ్యాన్ని బయటకు పంపించారు అనేది ఈ మూవీ కథ.. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో 10కి 7.6 ఆన్ లైన్ రేటింగ్ కలిగి ఉంది. ట్విస్ట్‌తో కూడిన ఈ హారర్ మూవీని మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..