AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : రామ్ చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన మహేష్.. ఆ సినిమా చాలా స్పెషల్..

సాధారణంగా సినీరంగంలో ఒక హీరోను ఊహించుకుని కథలు రాసుకుంటారు పలువురు డైరెక్టర్స్. ఆ హీరోకు తగినట్లుగానే పాత్రను డిజైన్ చేసుకుంటారు. కానీ అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టులకు అనుకున్న హీరో కాకుండా మరొకరి చేతికి వెళ్తుంది. అలాగే పలువురు వదిలేసిన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హీరోలు ఉన్నారు.

Mahesh Babu : రామ్ చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన మహేష్.. ఆ సినిమా చాలా స్పెషల్..
Ram Charan, Ntr, Mahesh
Rajitha Chanti
|

Updated on: Dec 19, 2025 | 1:49 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదెలా ఉంటే.. మహేష్ బాబు కెరీర్ లో ఓ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది. కానీ మీకు తెలుసా.. ఆ ప్రాజెక్టు ముందుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందట. కానీ పలు కారణాలతో వీరిద్దరు రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా అవకాశం మహేష్ వద్దకు వచ్చిందట. చివరకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి : Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా.. మిర్చి సినిమా తర్వాత డైరెక్టర్ కొరటాల శివ సినిమా.. ఎన్టీఆర్ కోసం ఒక కథ రాసుకున్నారట. కానీ ఆ సమయంలో వరుస కమిట్‌మెంట్స్ ఉండడం వల్ల ఈ సినిమా చేయలేనని చెప్పారట. ఆ తర్వాత అదే చిత్రాన్ని రామ్ చరణ్ వద్దకు తీసుకెళ్లారట. పలు కారణాలతో చరణ్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి : Dhurandhar: బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న ధురంధర్.. ఈ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో తోపు హీరోయిన్..

ఇక అదే చిత్రాన్ని కాస్తా మార్పులు చేసి మహేష్ బాబుకు వినిపించగా.. వెంటనే ఓకే చేశారట. అదే శ్రీమంతుడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 2015 ఆగస్ట్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : డీమాన్ దెబ్బకు మారిన ఓటింగ్.. ఆఖరి రోజు ఊహించని రిజల్ట్..

ఇవి కూడా చదవండి : Akhanda 2: అఖండ2లో బాలయ్య కూతురిగా నటించాల్సిన అమ్మాయి ఈమె కాదట.. స్టార్ హీరో కూతురు మిస్సైందిగా..