AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: లవర్ కోసం మతం మారిన యువకుడు.. కట్ చేస్తే.. కటకటాల్లోకి.. ఏం జరిగిందంటే..?

ప్రేమించిన యువతి కోసం ఇస్లాంలోకి మారిన ధనుంజయ్ తన పేరును షేక్ మొహమ్మద్ ఆసిఫ్‌గా మార్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్న అతడు చేసిన ఓ తప్పుతో వివాదంలో చిక్కుకున్నాడు. ఏకంగా జైలుకే వెళ్లాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: లవర్ కోసం మతం మారిన యువకుడు.. కట్ చేస్తే.. కటకటాల్లోకి.. ఏం జరిగిందంటే..?
Andhra Youth Arrested
Nalluri Naresh
| Edited By: |

Updated on: Dec 19, 2025 | 1:45 PM

Share

ప్రేమ గుడ్డిది అని.. ఊరికే అనలేదు. కొన్ని ఘటనలే దానికి నిదర్శనం. కొంతమంది ప్రేమించిన వారి కోసం ఏం చేయడానికైన వెనుకాడరు. అలాగే ఓ యువకుడు తన ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా మతం మార్చుకున్నాడు. కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా. జైలు పాలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అనే యువకుడు.. గోర్లవాండ్లపల్లికి చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడు. తమ పెళ్ళికి మతం అడ్డొస్తుందని. మతం మారితే ప్రేమించిన ప్రియురాలి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరిస్తారని ధనుంజయ్ ఇస్లాం మతం స్వీకరించాడు. ప్రేమించిన అమ్మాయి కోసం మతం మార్చుకున్న ధనుంజయ్. తన పేరును షేక్ మొహమ్మద్ ఆసిఫ్‌గా మార్చుకున్నాడు.

అంతవరకు బాగానే ఉంది.. కానీ ధనుంజయ్ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్.. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో వివాదంలో చిక్కుకున్నాడు.. తిరుపతికి చెందిన ప్రసన్నకుమార్ రెడ్డి వద్ద కారు అద్దెకు తీసుకున్న ధనుంజయ్ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్ యాక్సిడెంట్ చేయడంతో 15 వేల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో షేక్ మహ్మద్ ఆసిఫ్ బెంగళూరులో ఉన్న విషయం తెలుసుకొని.. అతని పట్టుకుని డబ్బులు అడగడంతో పాటు ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఐ లవ్ పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ మహమ్మద్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవడంతో దేవిరెడ్డిపల్లికి చెందిన గ్రామస్తులు నల్లచెరువు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ధనుంజయ్ అలియాస్ షేక్ మహమ్మద్ ఆసిఫ్ పై నల్లచెరువు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన మహమ్మద్ ఆసిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అలా ప్రేమ కోసం ఇస్లాంలోకి మారి పాక్ అనుకూల నినాదాలు యువకుడు ధనుంజయ్ అలియాస్ షేక్ మహమ్మద్ ఆసిఫ్ కటకటాల పాలయ్యాడు. ప్రేమించిన అమ్మాయి కోసం మతం మార్చుకోవడం తప్పుకాదు. కానీ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశాన్ని ఐ లవ్ పాకిస్తాన్. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..