స్టార్ కిడ్.. అందంలో అప్సరస.. ఆఫర్స్ మాత్రం నిల్లు..

Rajeev 

17 January 2026

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు.. అందం అభినయం ఉన్నా కూడా ఆఫర్స్ అందుకోలేకపోతున్నారు. 

స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోతోంది ఈ అమ్మడు.

నటన పరంగా మంచి మార్కులు కొట్టేసినా కూడా అంతగా సక్సెస్ కాలేకపోతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందంలోనూ అప్సరసే..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్‌గా ఎదిగారు. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు శివాత్మిక రాజశేఖర్.

స్టార్ హీరో రాజశేఖర్, జీవిత కూతురు శివాత్మిక. ఈ ముద్దుగుమ్మ దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ప్రస్తుతం ఈ చిన్నది ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. అలాగే సోషల్ మీడియాలో తన అందాలతో కవ్విస్తుంది.