AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న వివాదం

జీహెచ్‌ఎంసీ మొత్తం ఒకటే కార్పొరేషన్‌గా ఉంటుందంటూ ఒకసారి.. లేదూ రెండు, మూడు లేదా నాలుగు కార్పొరేషన్లు కావచ్చంటూ కొన్నిసార్లు లీకులు వచ్చాయ్. ప్రభుత్వం నుంచి ఔనని గానీ, కాదని గానీ స్పష్టత రాలేదు. కాకపోతే వార్డుల పెంపుతో పాటు 6 జోన్లను 12 జోన్లుగా మార్చడం, రెండు జోన్లకు ప్రత్యేకంగా అడిషనల్‌ కమిషనర్లుగా ఐఏఎస్‌లను నియమించడం చూస్తే మూడు కార్పొరేషన్ల ఏర్పాటు కన్ఫామ్ అనే సిగ్నల్స్ అందుతున్నాయి.

Telangana: సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న వివాదం
Secunderabad Municipal Corporation Demand
Krishna S
|

Updated on: Jan 17, 2026 | 10:01 PM

Share

సికింద్రాబాద్ అండ్ మల్కాజిగిరి.. ఈ రెండిటి మధ్య పోటీ మొదలైందిప్పుడు. ఔటర్ లోపల ఉన్న మొత్తం నగరాన్ని 300 వార్డులుగా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేయాలనే ప్రతిపాదన వినిపిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేరుతో కార్పొరేషన్లు తీసుకొచ్చే ప్లాన్ కనిపిస్తోంది. ఈ మల్కాజిగిరి కార్పొరేషన్‌లో సికింద్రాబాద్ ఉంటుందనేది ఓ వాదన. సరిగ్గా ఈ ప్రతిపాదనే కొత్త సెంటిమెంట్ రాజేసింది. ఒక రాజకీయ వివాదంగా మారింది. సికింద్రాబాద్‌కు 220 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. అలాంటి సికింద్రాబాద్ 1956 వరకు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గానే ఉండేది. ఆ తర్వాత హైదరాబాద్‌లో విలీనమైంది. రింగ్ రోడ్ లోపలున్న ప్రాంతమంతా జీహెచ్ఎంసీనే అనే నిర్ణయం తీసుకునేంత వరకు.. సికింద్రాబాద్ జోన్, సికింద్రాబాద్ సర్కిల్ ఉండేది. బట్.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఓ నెల క్రితం తీసుకున్న నిర్ణయంతో సికింద్రాబాద్ సర్కిల్ అనే పేరే కనుమరుగైంది. అటు సికింద్రాబాద్ జోన్ పరిధి మాత్రం పూర్తిగా మారింది. ఇప్పుడు మూడే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, అందులో సికింద్రాబాద్‌ను మల్కాజిగిరిలో కలిపేస్తే.. సికింద్రాబాద్ తన స్వయంప్రతిపత్తిని, చారిత్రకతను కోల్పోతుందనేది కొందరి వాదన. అందుకే, ‘మల్కాజ్‌గిరిలో విలీనం వద్దు – సికింద్రాబాద్‌కు ప్రత్యేక కార్పొరేషన్ ముద్దు’ అనే నినాదంతో ఆందోళనలు చేస్తున్నారు. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); ఈ కాలంలోనూ ఇంకా కంటోన్మెంట్లు ఏంటంటూ.. కేంద్ర రక్షణ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డ్ ఏరియాలను.. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లలో కలపాలని...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి