వాడి కన్ను పడిందా.. బైకు మాయం..! ఆస్పత్రులే టార్గెట్ గా రెచ్చిపోతున్న ముఠా అరెస్ట్..
ఆసుపత్రులే టార్గెట్ గా రెచ్చిపోతున్న బైక్ దొంగల ముఠాకు చెక్ పెట్టారు ఆదిలాబాద్ పోలీసులు. నిందితుడి వద్ద నుండి 12 బైకులను 3,86,000 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో బైకు చోరీలకు పాల్పడుతున్నచౌహాన్ శ్రావణ్ కుమార్ అలియాస్ రమేష్ అనే దొంగను అరెస్టు చేశారు ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు.

ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద, నిర్మల్ లోని ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద దొంగలించిన బండ్లను ఎలాంటి పత్రాలు లేకుండా కొనుగోలు చేసిన 12 మంది పై సైతం కేసులు నమోదు చేశారు పోలీసులు. దొంగ బైక్ లు కొనుగోలు చేసిన 12 మందిలో 11 మందిని అరెస్టు చేసినట్టు, ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాలను కొనుగోలు చేయవద్దని జిల్లా ఎస్పీ సూచించారు. వాహన నంబర్లను, చేసేస్ నెంబర్లను మార్చి, నకిలీ నెంబర్లను క్రియేట్ చేసి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలుతప్పవంటూ హెచ్చరించారు ఎస్పీ అఖిల్ మహాజన్.
A-1 చౌహాన్ శ్రవణ్ కుమార్ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వెంకిడి గ్రామం..
A-2: షేక్ సాయి భాష, ఆదిలాబాద్
A-3: మట్టా చందర్ సింగ్, సోనాల మండలం గుట్టపాక తాండా గ్రామం, ఆదిలాబాద్ జిల్లా
A-4: చౌహాన్ ప్రవీణ్, సోనాల పై కేసు నమోదు చేశారు.
A – 5: పవార్ రవి, బోథ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా
A – 6: బోడస్ శ్రీనివాస్, నేరడిగొండ గ్రామం , ఇందిరమ్మ కాలనీ, ఆదిలాబాద్ జిల్లా.
A-7: శివరాత్రి నరేష్, నేరడిగొండ , భీమన్న కాలనీ, ఆదిలాబాద్ జిల్లా.
A-8: దేశ్ముఖ్ బాబన్, సోనాల మండలం కోటా (కె) గ్రామం, ఆదిలాబాద్ జిల్లా
A-9: చౌహాన్ దినేష్, సోనాల మండలం గుట్టపాక తండా గ్రామం, ఆదిలాబాద్ జిల్లా.
A-10: చౌహాన్ మోహన్ సింగ్, సోనాల మండలం గుర్రాల తాండా గ్రామం, ఆదిలాబాద్ జిల్లా.
A-11: కటక్వార్ రామ్, సోనాల మండలం గుర్రాల తాండా గ్రామం, ఆదిలాబాద్ జిల్లా. (పరారీ)
A-12: షేక్ అఫాన్, బోథ్ మండలం, ఇస్లాంపురా, ఆదిలాబాద్ జిల్లా.
A-13: బోడసు వేను, తండ్రి: శంకర్, వయసు: 23 సంవత్సరాలు, నివాసం: నెరడిగొండ గ్రామం మరియు మండలం, భీమన్న కాలనీ, ఆదిలాబాద్ జిల్లా వారిపై కేసు నమోదు చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




