స్ట్రెచ్ మార్క్స్ మాయం చేసే సింపుల్ టిప్స్.. నేచురల్‌గా మీ స్కిన్ మళ్లీ స్మూత్..!
ఆడవారిలో గర్భధారణ తర్వాత లేదా బరువు పెరగడం వల్ల కడుపు, నడుముపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి. మగవారిలో ఉన్నట్టుండి బరువు పెరగడం, లేదా ఒక్కసారిగా కొవ్వు పేరుకుపోవడం లాంటివి జరిగినప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. వాటిని తొలగించడానికి కొంతమంది ఖరీదైన క్రీములు, నూనెలను ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఈ స్ట్రెచ్ మార్క్స్ పోవు. అలాంటి వారికి ఒక గొప్ప ఉపశమనం మన ఇంట్లో ఉంది.. కొన్ని ఇంటి చిట్కాలు ప్రయత్నిస్తే సులువుగా ఈ మార్క్స్ తగ్గిపోతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

శరీరంలోని ఏ భాగంలోనైనా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి చర్మం సాగడం లేదా కుంచించుకుపోవడం వల్ల ఏర్పడే ఒక రకమైన మచ్చలు. చర్మంలో ఇటువంటి ఆకస్మిక మార్పుల కారణంగా, చర్మానికి మద్దతు ఇచ్చే కొల్లాజెన్, ఎలాస్టిన్ చిరిగిపోవడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆడవారిలో గర్భధారణ తర్వాత లేదా బరువు పెరగడం వల్ల కడుపు, నడుముపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి. మగవారిలో ఉన్నట్టుండి బరువు పెరగడం, లేదా ఒక్కసారిగా కొవ్వు పేరుకుపోవడం లాంటివి జరిగినప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. వాటిని తొలగించడానికి కొంతమంది ఖరీదైన క్రీములు, నూనెలను ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఈ స్ట్రెచ్ మార్క్స్ పోవు. అలాంటి వారికి ఒక గొప్ప ఉపశమనం మన ఇంట్లో ఉంది.. కొన్ని ఇంటి చిట్కాలు ప్రయత్నిస్తే సులువుగా ఈ మార్క్స్ తగ్గిపోతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
స్ట్రెచ్‌మార్క్‌ను ఎలా తొలగించాలి:
ఆముదం నూనె: ఆముదం నూనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకోసం ముందుగా, స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి. పడుకునే ముందు ఆముదం నూనెను దానిపై రుద్దండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడిగేయండి. కనీసం మూడు నెలల పాటు ఇలా వాడుతూ ఉంటే, మీరు ఆశించిన ఫలితం ఉంటుంది.
ఆముదం ప్రయోజనాలు: పొడి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మాన్ని లోతుగా పోషిస్తుంది. మచ్చలు, నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమలు, వాపులను తగ్గిస్తుంది. ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. పగిలిన పెదవుల చికిత్సలో, మడమలలో పగుళ్లను పూరించడానికి ఉపయోగపడుతుంది.
ఇంట్లోనే ప్రత్యేకమైన స్ట్రెచ్ మార్క్ క్రీమ్ తయారు చేసుకోండిలా..
మార్కెట్లో అనేక రకాల స్ట్రెచ్ మార్క్ రిమూవల్ క్రీములు అందుబాటులో ఉన్నాయి. కానీ, మీరు ఇంట్లోనే ఈ స్ట్రెచ్ మార్కులను వదిలించుకోవాలనుకుంటే, ఇలా ఒక క్రీమ్ తయారు చేసుకుని ఉంచండి. దీన్ని 15 రోజుల పాటు నిరంతరం అప్లై చేయడం వల్ల స్ట్రెచ్ మార్కులలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఈ హోంమేడ్ క్రీమ్ స్ట్రెచ్ మార్కులను తేలికపరచడమే కాకుండా చర్మంపై కనిపించే ఇతర గుర్తులు, మచ్చలను కూడా తేలికపరుస్తుంది. కాబట్టి, హోంమేడ్ క్రీమ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
స్ట్రెచ్ మార్క్స్ కోసం ఇంట్లో తయారుచేసిన క్రీమ్:
ఒక గాజు కూజాలో కలబంద జెల్ తీసుకోవాలి.. దానికి సమాన మొత్తంలో ఆలివ్ ఆయిల్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే, రెండు నుండి మూడు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లోని ఆయిల్‌ని మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ క్రీమ్‌ను 15 రోజుల వరకు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన ఈ క్రీమ్‌ను రోజుకు రెండు నుండి మూడు సార్లు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మార్క్స్ క్రమంగా కనబడకుండా పోతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




